
‘దృశ్యం’ చిత్రాల సిరీస్‌లో మోహన్‌లాల్ పెద్ద కుమార్తె అంజు జార్జ్ పాత్రలో అలరించారు నటి అన్సీబా హాసన్. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా దీనికి గల కారణం సహ నటుడు టైనీ టామ్, ‘అమ్మ’లోని కొందరు సభ్యులు వ్యక్తిగతంగా కించపరచడం, మతపరమైన దూషణలకు పాల్పడి సంస్థ నుంచి రాజీనామా చేయమని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. ‘దృశ్యం’ చిత్రాల సిరీస్‌లో మోహన్‌లాల్ పెద్ద కుమార్తె అంజు జార్జ్ పాత్రలో అలరించారు నటి అన్సీబా హాసన్. ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు రాజీనామా చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా దీనికి గల కారణం సహ నటుడు టైనీ టామ్, ‘అమ్మ’లోని కొందరు సభ్యులు వ్యక్తిగతంగా కించపరచడం, మతపరమైన దూషణలకు పాల్పడి సంస్థ నుంచి రాజీనామా చేయమని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు. తాజాగా అన్సీబా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టామ్ నాపై ‘జిహాదీ’ అనే ముద్ర వేశారు. మతపరమైన వ్యాఖ్యలతోపాటు నా వ్యక్తిగత జీవితంపై రూమర్స్ వ్యాప్తి చేశారని సంస్థలోని మరో సభ్యుడే నాకు స్వయంగా చెప్పారు. అమ్మ కమిటీలోని ఒక మహిళా సభ్యురాలు నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆ వివాద సమయంలో అధ్యక్షుడుగానీ, ఇతర బాధ్యత గల కార్యవర్గ సభ్యులు గానీ నాకు అండగా నిలవలేదు. నేను తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాను. ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టదలుచుకోలేద’’ని ఆమె తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ నటుడు టైనీ టామ్ స్పందించారు. ‘‘హాసన్ వాదనలు కేవలం వదంతుల ఆధారంగానే ఉన్నాయి. నేను ఆమెపై అలాంటి వ్యాఖ్యలు చేశానని వేరొకరు చెప్పారని ఆమె అన్నారు. నిజాయతీగా పనిచేస్తూ, నిష్కపటంగా మాట్లాడే వ్యక్తిని నేను. ఈ విషయంపై కమిటీ తగిన నిర్ణయం తీసుకుంటుందని’’ అన్నారు. అమ్మ అధ్యక్షురాలు శ్వేత మేనన్ కూడా అన్సీబా వ్యక్తిగత కారణాలు, వృత్తిపరమైన కమిట్మెంట్స్ వల్ల రాజీనామా చేశారని మీడియాతో వెల్లడించారు. తాజాగా అన్సీబా చేసిన వ్యాఖ్యలు మలయాళ చిత్రసీమలో వివాదాస్పదం అయ్యాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending