
జాన్వీ కపూర్, రామ్‌చరణ్, ఏఆర్ రెహమాన్, వెంకట సతీశ్ కిలారు ‘పెద్ది’ తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమన్నారు కథానాయకుడు రామ్‌చరణ్. ఇది తన ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ వన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ‘పెద్ది’ తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమన్నారు కథానాయకుడు రామ్‌చరణ్. ఇది తన ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ వన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మించారు. జాన్వీ కపూర్ కథానాయిక. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 4న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి భోపాల్‌లో ‘పెద్ది కీ ఆవాజ్’ పేరుతో ప్రచార వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఆహుతుల్ని ఉర్రూతలూగించింది. దీనిలో భాగంగా చరణ్ కోరిక మేరకు ఇంకా విడుదల కాని ఈ చిత్ర థీమ్ గీతాన్ని రెహమాన్ లైవ్‌లో వినిపించారు. అనంతరం రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం క్రీడా నేపథ్య చిత్రమే కాదు.. తన గుర్తింపు కోసం పోరాడే ఓ వ్యక్తి కథ. ఆ పోరాటం కచ్చితంగా అందరి మనసుల్ని దోచుకుంటుంది. ప్రతిఒక్కర్నీ ఆలోచింపజేస్తుంది.. స్ఫూర్తిని రగిలిస్తుంది. ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా చేస్తుంది. దీన్ని కచ్చితంగా మీ పిల్లలతో కలిసి చూడండి. వాళ్లలో స్ఫూర్తిని నింపుతుంది’’ అన్నారు.ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రులు విశ్వాస్ సారంగ్, రాకేశ్ శుక్లా, ఎంపీ రవికిషన్, సినీతారలు జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, నిర్మాత సతీశ్ కిలారు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending