
వైవిధ్యమైన కథలతో, సరికొత్త ప్రయోగాలు చేస్తూ వీక్షకుల్ని అలరిస్తుంది ఈటీవీ విన్. ఈ నేపథ్యంలోనే ‘కథాసుధ’లో భాగంగా ‘కాలనీ సర్కస్’ అనే సినిమాతో వినోదాలను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ఈటీవీ విన్ వేదికగా ఈ చిత్రం ప్రసారం కానుంది. వైవిధ్యమైన కథలతో, సరికొత్త ప్రయోగాలు చేస్తూ వీక్షకుల్ని అలరిస్తుంది ఈటీవీ విన్. ఈ నేపథ్యంలోనే ‘కథాసుధ’లో భాగంగా ‘కాలనీ సర్కస్’ అనే సినిమాతో వినోదాలను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ఈటీవీ విన్ వేదికగా ఈ చిత్రం ప్రసారం కానుంది. వేరే వ్యక్తితో పోల్చుకుంటూ కాలనీలో తనకంటూ ప్రాధాన్యత ఉండాలని కలర్ టీవీ కొంటాడు లెక్కల మాస్టారు సూర్యనారాయణ. కానీ, ఆ టీవీలో తమకి నచ్చినవి చూస్తామంటూ కాలనీవాసులంతా రిమోట్ కోసం పోటీకి దిగుతారు. దాంతో రిమోట్ కోసం వారందరి మధ్య ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికలో ఎవరు గెలిచారో తెలియాలంటే ‘కాలనీ సర్కస్’ సినిమా చూడాల్సిందే. ఇందులో వెంకటేశ్ మహా, ఉద్విత హర్ష, కిరీటి దామరాజు, మాస్టర్ ఆరవ్ తదితరులు నటించారు. శశాంక్ పోసింశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాహుల్ తమడ, సాయిదీప్ బొర్ర కలిసి నిర్మించారు. ఇటీవల ‘కాలనీ ప్రశాంతంగా ఉన్నా.. మా కాలనీ వాళ్లు అంత ప్రశాంతంగా ఉండరులేండి’ లాంటి సంభాషణలతో కాలనీవాసుల మధ్య సరదా సన్నివేశాలతో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Summary status: pending