
Sona Heiden Vignesh Shivan: కోలీవుడ్ సీనియర్ నటి సోనా హేడెన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గతంలో తనకు ఉన్న ప్రత్యేక బంధం గురించి ఆమె సంచలన విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు విఘ్నేష్ తన ఆఫీసులోనే కొన్నేళ్ల పాటు పనిచేశాడని, ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోనా బహిరంగంగా వెల్లడించారు. కోలీవుడ్ సీనియర్ నటి సోనా హేడెన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో గతంలో తనకు ఉన్న ప్రత్యేక బంధం గురించి ఆమె సంచలన విషయాలను పంచుకున్నారు. ఒకప్పుడు విఘ్నేష్ తన ఆఫీసులోనే కొన్నేళ్ల పాటు పనిచేశాడని, ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సోనా బహిరంగంగా వెల్లడించారు. విఘ్నేష్ శివన్ కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ సోనా హేడెన్ అనేక రహస్యాలు పంచుకున్నారు. "విఘ్నేష్ శివన్ దాదాపు మూణ్ణాలుగేళ్ల పాటు నా ఆఫీసులోనే పనిచేశాడు. ఆ సమయంలో నా పనుల్లో ఎంతో సహాయం చేస్తూ నాకు చాలా క్లోజ్ అయ్యాడు." "నిజం చెప్పాలంటే.. నేను విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డాను. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఆ తర్వాత ఎలాంటి గొడవలు లేకుండానే అతను నా నుంచి దూరమయ్యాడు. కాలక్రమేణా మా జీవితాలు మారిపోయాయి. బహుశా అతను నన్ను మర్చిపోయి ఉండొచ్చు. కానీ అతను చాలా మంచి వ్యక్తి, అతనిపై నాకు "నిజం చెప్పాలంటే.. నేను విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడ్డాను. మా ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. ఆ తర్వాత ఎలాంటి గొడవలు లేకుండానే అతను నా నుంచి దూరమయ్యాడు. కాలక్రమేణా మా జీవితాలు మారిపోయాయి. బహుశా అతను నన్ను మర్చిపోయి ఉండొచ్చు. కానీ అతను చాలా మంచి వ్యక్తి, అతనిపై నాకు ఎలాంటి కోపం లేదు" అని సోనా పేర్కొన్నారు. విఘ్నేష్ భార్య, నటి నయనతారపై సోనా హేడెన్ ఈ సందర్భంగా ప్రశంసల వర్షం కురిపించారు. "ఒక మహిళగా, నటిగా నయనతార సాగించిన ప్రయాణం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. నా జీవితంలో నేను ఎలాంటి విమర్శలను, ఒడిదొడుకులను ఎదుర్కొన్నానో.. నయనతార కూడా తన కెరీర్లో అలాంటి ఎన్నో కష్టాలను భరించింది. అందుకే ఆమె అంటే నా మనసులో ఎంతో గౌరవం ఉంది" అని ఆమె చెప్పుకొచ్చింది. తాను జీవితంలో అందరినీ అంత సులభంగా నమ్మనని, కానీ మనసు విప్పి మాట్లాడిన అతికొద్ది మందిలో విఘ్నేష్ శివన్ ఒకరని ఆమె గుర్తుచేసుకున్నారు. తన భవిష్యత్తు ప్రణాళికల గురించి చెబుతూ సోనా ఒక ఆసక్తికరమైన లీక్ ఇచ్చారు. తన జీవిత కథ ఆధారంగా త్వరలోనే ఒక బయోపిక్ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. "నా పర్సనల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఎవరికైనా ఊరికే చెప్పేసేవి కావు. జనాలు నా గురించి చూసిన విషయాలు వేరు.. నా బయోపిక్‌లో నేను చెప్పబోయే నిజాలు వేరు. నా జీవితంలోని రహస్యాలను ఎలా దాచాలో నాకు బాగా తెలుసు" అంటూ ఆమె సస్పెన్స్ స్క్రీన్‌ను దించేశారు. ఒకప్పుడు తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ నటిగా, ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న సోనా.. తెలుగులో 'ఆయుధం', 'వీడే', 'విలన్', 'ఆంధ్రావాలా' సినిమాల్లో నటించి మెప్పించింది.