
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది. న్యూఢిల్లీ: కర్ణాటకలో నాయకత్వ మార్పిడి సజావుగా పూర్తి చేసేందుకు కేంద్ర నాయకత్వం గట్టి కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా సీఎం సిద్ధరామయ్య సేవలను కేంద్ర స్థాయిలో ఉపయోగించునేందుకు వీలుగా ఆయనను రాజ్యసభకు పంపాలని పట్టుదలగా ఉంది. అయితే ఆలోచించుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని కేంద్ర నాయకత్వం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడంతో సిద్ధరామయ్య ఎప్పుడు రాజీనామా చేస్తారు? డీకే ఎప్పటిలోగా ప్రమాణస్వీకారం చేస్తారనే అంశాలు ఆసక్తిరకంగా మారాయి. ఇందులో రెండు ఆప్షన్లు ఉన్నట్టు చెబుతున్నారు. ఒక ఆప్షన్ ప్రకారం ఈనెల 28న కానీ 29న కానీ సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందజేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈవారం చివర్లో (30వ తేదీ) డీకే కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చు. రెండో ఆప్షన్ ప్రకారం సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకునే విషయంలో జాప్యం తలెత్తవచ్చు. అదే జరిగితే జూన్ 18న రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాతే సిద్ధరామయ్య రాజీనామా చేయడం, డీకే శివకుమార్ సీఎం పగ్గాలు చేపట్టడం జరుగుతుంది. కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, సంఖ్యాబలం ఆధారంగా 3 సీట్లను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. సిద్ధరామయ్యకు ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్ అదిష్ఠానం ఇప్పటికే ఆఫర్ ఇచ్చింది. రెండో సీటులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసే అవకాశం ఉంది. ఖర్గే ప్రస్తుతం కర్ణాటక నుంచి Home » National » Siddaramaiah and Mallikarjun Kharge likely to contest Rajya Sabha from Karnataka AVR ABN , Publish Date - May 27 , 2026 | 05:05 PM కర్ణాటక నుంచి 4 రాజ్యసభ సీట్లకు ఎన్నికల జరగాల్సి ఉండగా, సంఖ్యాబలం ఆధారంగా 3 సీట్లను కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. సిద్ధరామయ్యకు ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్ అదిష్ఠానం ఇప్పటికే ఆఫర్ ఇచ్చింది. రెండో సీటులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసే అవకాశం ఉంది. ఖర్గే ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. కాగా, మూడో రాజ్యసభ సీటు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కొత్త మంత్రివర్గంలో కనీసం ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉండాలని, తద్వారా 'పవర్ బ్యాలెన్స్'కు వీలుంటుందని సిద్ధరామయ్య వర్గం ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్ చేతిలో ప్రస్తుతం ఉన్న కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా ఆ వర్గం కోరుతున్నట్టు చెబుతున్నారు. కర్ణాటక కొత్త సీఎం ప్రమాణస్వీకారం మే 30..! ఈసారి ముగ్గురు డిప్యూటీ సీఎంలు బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు, 50 మంది ఎమ్మెల్యేలు