
Jio OTT Pass:దేశంలో టెలికాం రంగంలో ముందంజలో ఉన్న జియో ఇప్పుడు వినియోగదారుల కోసం మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ₹200 ధరతో కొత్త “జియో OTT పాస్”ను కంపెనీ ప్రకటించింది. ఈ ప్యాక్ ద్వారా కేవలం 28 రోజుల వ్యవధిలోనే OTTలు, లైవ్ టీవీ ఛానెల్స్, డేటా మరియు అపరిమిత 5G వంటి అనేక ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. ఈ ప్యాక్ 2026 మే 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త ప్యాక్‌లో మొత్తం 15 ప్రీమియం OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ లభిస్తుంది. వినియోగదారులు మొబైల్, టీవీ, టాబ్లెట్ వంటి పరికరాల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ మరియు వినోద కార్యక్రమాలను వీక్షించవచ్చు. ఇందులో ముఖ్యంగా యూట్యూబ్ ప్రీమియం కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రకటనలు లేకుండా వీడియోలు చూడటం, బ్యాక్‌గ్రౌండ్ ప్లే మరియు ఆఫ్‌లైన్ డౌన్లోడ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, జియోహాట్‌స్టార్ మొబైల్ + హాలీవుడ్ యాక్సెస్ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. దీంతో హాలీవుడ్ సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ మరియు ప్రముఖ ఒరిజినల్ కంటెంట్‌ను వినియోగదారులు ఆస్వాదించవచ్చు. ఇక జియోటీవీ ద్వారా సోనీలివ్, జీ5, డిస్కవరీ ప్లస్, సన్ ఎన్ఎక్స్టీ వంటి మరిన్ని OTT సేవలను కూడా పొందవచ్చు. మొత్తంగా ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులకు పెద్ద స్థాయిలో వినోదం అందించాలనే లక్ష్యంతో జియో ముందుకు వచ్చింది. ఈ పాస్‌లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అందులో 150కు పైగా పేడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వినోదం, సినిమాలు, స్పోర్ట్స్, వార్తలు మరియు ప్రాంతీయ ఛానెల్స్‌ను కూడా వీక్షించే అవకాశం ఈ పాస్‌లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్ కూడా ఉన్నాయి. అందులో 150కు పైగా పేడ్ ఛానెల్స్ ఉండటం విశేషం. వినోదం, సినిమాలు, స్పోర్ట్స్, వార్తలు మరియు ప్రాంతీయ ఛానెల్స్‌ను కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. డేటా విషయానికి వస్తే, ఈ ప్యాక్‌లో 30 GB హై-స్పీడ్ 4G/5G డేటా లభిస్తుంది. అదనంగా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్నవారికి అపరిమిత 5G సేవ కూడా అందుబాటులో ఉంటుంది. నెలకు సుమారు ₹1,500 విలువైన ప్రయోజనాలను కేవలం ₹200కే అందిస్తున్న ఈ కొత్త జియో OTT పాస్ ప్రస్తుతం వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.