
అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడి, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హీరో రామ్.. కాంబినేషన్లో సినిమా ఫిక్సయిందంటూ, టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అపజయమెరుగని దర్శకుడు, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే హీరో కాంబినేషన్లో సినిమా ఫిక్సయిందంటూ.. టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి.. ‘రాజా ది గ్రేట్’ (Raja The Great) చిత్రానికి కలిసి పనిచేయాల్సిన ఈ కాంబో.. ఆ సినిమా వచ్చిన దాదాపు పదేళ్ల తర్వాత కలిసి పనిచేయబోతున్నారనేలా టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు, హీరో ఎవరనేది.. ఫై ఫొటో చూస్తుంటే తెలుస్తుందిగా. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)తో, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేసిన ‘రాజా ది గ్రేట్’ చిత్ర కథని మొదట రామ్(Hero Ram)కే వినిపించారట. కానీ, సినిమా సెట్ కాలేదు. అప్పటి నుంచి ఈ కాంబోలో సినిమా రాబోతుందనేలా ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రచారమే కానీ, ప్రాజెక్ట్ మాత్రం ఓకే కాలేదు. మళ్లీ అలాగే ప్రచారం మొదలైంది. ఈ సారి సినిమా విడుదల ఎప్పుడో కూడా చెబుతూ వార్తలు వండేస్తున్నారు. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అనేలా గత కొన్ని సంవత్సరాలుగా అర్థం మారిపోయింది. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ కొడుతూ.. సంక్రాంతి చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి.. ఈసారి ఆ సెంటిమెంట్‌ని పక్కన పెట్టి.. 2027 దసరా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. రామ్, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకోనున్న చిత్రం 2027 దసరాకు రిలీజ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కాంబోలో మూవీ సెట్టయిందా? లేదా? అనేదే ఇంత వరకు క్లారిటీ లేదు.. అలాంటిది రిలీజ్ వరకు మ్యాటర్ తీసుకెళ్లి.. ‘సోమలింగం’ Home » Tollywood » anil ravipudi hero ram movie rumours for dasara release rcb ABN , Publish Date - May 27 , 2026 | 05:42 PM సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి అనేలా గత కొన్ని సంవత్సరాలుగా అర్థం మారిపోయింది. సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి సక్సెస్ కొడుతూ.. సంక్రాంతి చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి.. ఈసారి ఆ సెంటిమెంట్‌ని పక్కన పెట్టి.. 2027 దసరా బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. రామ్, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకోనున్న చిత్రం 2027 దసరాకు రిలీజ్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు ఈ కాంబోలో మూవీ సెట్టయిందా? లేదా? అనేదే ఇంత వరకు క్లారిటీ లేదు.. అలాంటిది రిలీజ్ వరకు మ్యాటర్ తీసుకెళ్లి.. ‘సోమలింగం’ సామెతలా మార్చేశారు. అసలీ కాంబోలో సినిమా ఉందా? లేదా? అనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎప్పుడొస్తుందో కూడా తెలియదు. ఒకవేళ ఈ కాంబోలో సినిమా సెట్టయినా.. చాలా సమయం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే, రామ్ ప్రస్తుతం హీరోగానే కాకుండా.. మెగా ఫోన్ కూడా పట్టారు. ఆయన దర్శకత్వంలో చేయబోతున్న ప్రాజెక్ట్, రీసెంట్‌గానే అధికారికంగా ప్రకటించారు. మరోవైపు అనిల్ రావిపూడి మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. వెంకీ, కళ్యాణ్ రామ్‌లతో ఆయన చేస్తున్న మూవీ, శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కూడా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడనేలా వినిపిస్తోంది. ఏదిఏమైనా 2027 సంక్రాంతి నాటికి రామ్ కూడా ఫ్రీ అయితే మాత్రం.. అప్పుడు ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.. అప్పటికి సమీకరణాలు ఎలా ఉంటాయో..? ‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే? ‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు! మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా! System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్' ఓటీటీ మూవీ రివ్యూ