
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Congress leader Osman al hajri attacks on feroz khan in Gandhi bhavan: తెలంగాణ రాజకీయాల్లో కొంత మంది నేతలు సొంత పార్టీకే తలనొప్పులు కల్గించేలా మాట్లాడుంటారు. కొన్నిసార్లు గీత దాటి కూడా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు చర్యలు తీసుకుంటాయి. ఇదంతామనం రోటీన్‌గా చూస్తుంటాం. ఇక కాంగ్రెస్ పార్టీ తీరు కాస్త భిన్నంగా ఉంటుందని చెప్పుకొవచ్చు. ఈ పార్టీలోని నేతలకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తరచుగా చెప్తారు. కొంతమంది నేతలు లైన్ దాడి తమ పార్టీకి చెందిన సీఎంతో పాటు మంత్రులపై కూడా ఆరోపణలు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు ఇలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం మనం తరచుగా చూస్తుంటాం. ఈ క్రమంలో తాజాగా.. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మరోసారి నేతల మధ్య ఫైటింగ్ కు వేదికగా ామారింది. ఉస్మాన్ నాకు అన్న లాంటి వాడు.. ఇది మా ఫ్యామిలీ వ్యవహారం గాంధీ భవన్లో నిర్వహించిన పార్లమెంట్ సమీక్షా సమావేశంలో జరిగిన గొడవ గురించి స్పందించిన ఫిరోజ్ ఖాన్ https://t.co/44bdB5BEH1 pic.twitter.com/Pdmz2G1mni హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల బలోపేతంపై చర్చించేందుకు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రుల సమక్షంలోనే నేతలు ఫైటింగ్ కు దిగారు. నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీ — Telugu Scribe (@TeluguScribe) May 27, 2026 హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల బలోపేతంపై చర్చించేందుకు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రుల సమక్షంలోనే నేతలు ఫైటింగ్ కు దిగారు. నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య జరిగిన ఘర్షణతో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యంగా ప్రొటొకాల్ అంశంలో ఇద్దరు కీలక నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త చివరకు తోసుకొవడం వరకు వెళ్లింది. ఉస్మాన్ హజ్రీ తొసేయడంతో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. అక్కడే ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, హనుమంత రావు వంటి కీలక నేతలు వారిని సముదాయించే ప్రయత్నం చేసిన కూడా వెనక్కు తగ్గలేదు. దీంతో ఈ ఘటనతో గాంధీ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో అక్కడి నుంచి సమావేశం నిర్వహించకుండానే మంత్రులు అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత హనుమంత్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. Read more: Pinarayi Vijayan ED Raids: మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులు.. కేరళంలో హైటెన్షన్.. అధికారుల వాహనాలు ధ్వంసం.. గాంధీభవన్ లో నిర్వహించిన సమావేశంలో నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నేత ఉస్మాన్ అల్ హజ్రీలు మంత్రుల పక్కన కూర్చొవడం విషయంలో గొడవలకు దిగారు. ఈ క్రమంలో ఉస్మాన్ గట్టిగా తోసేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడిపోయారు. ఇది చూసిన ఫిరోజ్ ఖాన్ అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయి గట్టిగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ లో గందగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల వ్యవహరం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి