
రంగు, రూపు, చక్కదనం.. అందమంటే చాలామంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ సిసలైన సౌందర్యం మన ఆత్మవిశ్వాసంలోనే ఉందని నిరూపిస్తున్నారు కొందరమ్మాయిలు. తబితా మేరీ ఇదే కోవకు చెందుతుంది. రంగు, రూపు, చక్కదనం.. అందమంటే చాలామంది వీటినే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ సిసలైన సౌందర్యం మన ఆత్మవిశ్వాసంలోనే ఉందని నిరూపిస్తున్నారు కొందరమ్మాయిలు. తబితా మేరీ ఇదే కోవకు చెందుతుంది. జర్మనీలో స్థిరపడిన ఈ తమిళ మోడల్ తన చామనఛాయ రంగు కారణంగా చిన్నతనం నుంచి వర్ణ వివక్షను ఎదుర్కొంది. కానీ ఎప్పు్డైతే తనను తాను అంగీకరించడం మొదలుపెట్టిందో అప్పట్నుంచి.. తానెలా ఉందో అలాగే కెమెరా ముందుకు రావడం ప్రారంభించింది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవంలోనూ తన సహజసిద్ధమైన లుక్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఈ ఫొటోల్ని తబిత తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. తన ఆత్మవిశ్వాసాన్ని చూసి చాలామంది నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘ఈ న్యాచురల్ బ్యూటీకి సినిమాల్లో అవకాశమివ్వమం’టూ దర్శకనిర్మాతల్ని కోరుతున్నారు. ‘లవర్ ఆఫ్ లైఫ్’.. సోషల్ మీడియాలో తనను తాను ఇలాగే పరిచయం చేసుకుంటుంది తబిత. తద్వారా తనలోని స్వీయ ప్రేమను చాటుకుంటుంది. అయితే నిజానికి 19 ఏళ్లొచ్చే దాకా తానింత పాజిటివిటీతో లేనని, ఎందుకంటే చర్మ ఛాయ కారణంగా సమాజం తనను చిన్న చూపు చూసిందని చెబుతోంది. ‘మాది తమిళ మూలాలున్న కుటుంబం. నేను పుట్టకముందే మా అమ్మానాన్నలు జర్మనీలోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. విదేశంలోనే పుట్టినా తమిళమ్మాయిగానే నన్ను పెంచారు. నాకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇందుకు నేను సరిపోనేమో అని భావించేదాన్ని. ఎందుకంటే చర్మ ఛాయ తక్కువగా ఉన్న మోడల్స్, ఇతర ప్రముఖుల్ని నేను ‘మాది తమిళ మూలాలున్న కుటుంబం. నేను పుట్టకముందే మా అమ్మానాన్నలు జర్మనీలోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. విదేశంలోనే పుట్టినా తమిళమ్మాయిగానే నన్ను పెంచారు. నాకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. కానీ ఇందుకు నేను సరిపోనేమో అని భావించేదాన్ని. ఎందుకంటే చర్మ ఛాయ తక్కువగా ఉన్న మోడల్స్, ఇతర ప్రముఖుల్ని నేను అప్పటిదాకా చూడలేదు. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎన్నో తమిళ సినిమాలు చూశా. వెండితెరపైనా ఫెయిర్‌గా ఉన్న నటీనటులే కనిపించేవారు. ఇక స్కూల్లోనూ నన్ను, నా రంగును చూసి తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఇవన్నీ నన్ను మానసికంగా కుంగదీసేవి. ఒక్కోసారి.. నేను తెల్లజాతి కుటుంబంలో పుట్టి ఉంటే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండేవేమో, సమాజం నన్ను అంగీకరించేదేమో, నాకు నచ్చినట్లుగా నా జీవితాన్ని నిర్మించుకునేదాన్నేమో.. ఇలా నా మనసు ఎన్నో ఆలోచనలతో నిండిపోయేది..’ అంటూ తానెదుర్కొన్న వర్ణ వివక్ష గురించి చెప్పుకొచ్చింది తబిత. తనకు 19 ఏళ్లొచ్చే దాకా చర్మ ఛాయ విషయంలో నెగెటివిటీలోనే ఉండిపోయిన తబిత.. ఆ తర్వాతే స్వీయ లోపాల్ని పక్కన పెట్టి తనను తాను అంగీకరించడం మొదలుపెట్టానంటోంది. ‘జర్మనీలో తెల్లటి చర్మ ఛాయ ఉన్న వ్యక్తుల మధ్య పెరగడం వల్ల.. చర్మ రంగు, అందం, సంస్కృతీ సంప్రదాయాలు.. ఇలా ప్రతి విషయంలోనూ నేను భిన్నం అని భావించేదాన్ని. దీనివల్ల ఒంటరితనం వేధించేది. చిన్నతనంలో ఇవన్నీ అర్థం చేసుకొనే పరిణతి కూడా నాకు లేదు. కానీ టీనేజ్ దశకు చేరుకున్నాక కొందరు నన్ను.. ‘నువ్వు నల్లగా ఉన్నా.. నీ ముఖం చాలా కళగా ఉంది..’ అనేవారు. ఆ మాటలు నాలో పాజిటివిటీని నింపాయి. అప్పటిదాకా నా చర్మ ఛాయను మేకప్‌తో కవర్ చేసుకున్న నేను.. ఇకపై నేనెలా ఉన్నానో అలాగే కెమెరా ముందుకు రావాలనుకున్నా. ఇలా 19 ఏళ్ల వయసులో నన్ను నేను అంగీకరించడం మొదలుపెట్టా. ఈ క్రమంలోనే నాలాగా అందం, రూపం, చర్మ ఛాయ.. తదితర విషయాల్లో ఆత్మన్యూతనకు గురయ్యే వారిని ప్రోత్సహించాలనుకున్నా. ఈ ఆలోచనతోనే 2018లో ‘ది బుకింగ్ ప్రాజెక్ట్’ పేరుతో ఓ ఆన్లైన్ వేదికను ప్రారంభించా. ప్రస్తుతం ఈ వేదికగా.. సమాజం నుంచి వివిధ రకాలుగా వివక్షను ఎదుర్కొన్న ఔత్సాహిక కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఆర్టిస్టుల్లోని ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూ.. వాళ్లకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా..’ అంటోంది తబిత. ఇలా ఇతర కంటెంట్ క్రియేటర్స్ని ప్రోత్సహించడమే కాదు.. తానూ బ్యూటీ, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరు తెచ్చుకుంది తబిత. ఈ క్రమంలో బ్యూటీ, ఫ్యాషన్‌కు సంబంధించిన కొత్త ట్రెండ్స్, చిట్కాల్ని.. ఫొటోలు, వీడియోల రూపంలో నెటిజన్లకు పరిచయం చేస్తోంది. ఎలా ఉన్నా మనల్ని మనం అంగీకరించినప్పుడే సంతోషంగా ఉండగలమని చెబుతోన్న ఆమె.. మేకప్ లేకుండా/తక్కువ మేకప్‌తోనే ఆయా ఫ్యాషన్ షోలలో మెరుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలే కేన్స్ రెడ్ కార్పెట్పైనా న్యాచురల్ లుక్‌లోనే హొయలుపోయింది. ఓ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ రూపొందించిన లిక్విడ్ సిల్వర్ కలర్ మెటాలిక్ గౌన్‌లో ముస్తాబై ఈ ఈవెంట్‌కి వచ్చిన ఆమె.. నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజిచ్చింది. తద్వారా ఈ