
ముల్లన్‌పుర్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ 97 (29 బంతుల్లో, 5 ఫోర్లు, 12 సిక్స్‌లు), ధ్రువ్ జురెల్ 50 పరుగులు (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసి సత్తా చాటారు. యశస్వి జైస్వాల్ 29, రియాన్ పరాగ్ 26, ఫెరీరా 12, జడేజా 12*, జోఫ్రా ఆర్చర్ 4, శనక 5, నాంద్రె బర్గర్ 1, సుశాంత్ మిశ్రా 1* రన్స్ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే 3 వికెట్లు పడగొట్టాడు. ఎషాన్ మలింగ, శివాంగ్ కుమార్, నితీశ్‌రెడ్డి తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను (30 బంతుల్లో) అధిగమించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్లతో చెలరేగాడు. 29 బంతుల్లో 97 పరుగులు సాధించాడు.