
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో ఓ మహిళా పేషెంట్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న భారత సంతతి న్యూరో సర్జన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆమెకు నొప్పినివారణ మందులు ఇవ్వడాన్ని అక్కడి మెడికల్ కౌన్సిల్ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఎనిమిది నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారత సంతతికి చెందిన డాక్టర్ చిరాగ్ పటేల్.. వేల్స్‌లోని హాస్పిటల్లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. అయితే, వెన్ను సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు 2019-2021 మధ్యకాలంలో మూడుసార్లు శస్త్రచికిత్స చేశారు. అనంతరం వారిమధ్య సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఆమెకు ఔషధాలు ఇచ్చినప్పటికీ.. వాటిని మెడికల్ రికార్డుల్లో నమోదు చేయలేదని తెలిసింది. కొంతకాలం ఈ వ్యవహారం కొనసాగినప్పటికీ.. 2023లో వారిద్దరి మధ్య బంధం బీటలు వారింది. దీంతో డాక్టర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఆ మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, వైద్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోనప్పటికీ.. ఈ విషయాన్ని మెడికల్ బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. ఇందులో తన తప్పిదాన్ని పటేల్ అంగీకరించారు. వైద్యుడి పశ్చాతాపాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. ఎనిమిది నెలలపాటు సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.