
ట్రాన్స్జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు గొప్ప ఆలోచన 2014-19 మధ్య పింఛన్లు, ఇళ్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించారు ‘మహానాడు’లో ట్రాన్స్జెండర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పీఏ వర్షిణి ఈనాడు, అమరావతి: స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వమూ, ఏ రాజకీయ నాయకులు చేయని ఆలోచనలు కూటమి ప్రభుత్వంలో చేసి ట్రాన్స్జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ట్రాన్స్జెండర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలు (ఏపీ) వర్షిణి చెప్పారు. ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, అందులో ట్రాన్స్జెండర్ను నియమించడం ఎవరికీ సాధ్యం కాని గొప్ప ఆలోచనని అభివర్ణించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో పింఛన్లు, ఇళ్లు వంటివి కల్పించి సమాజంలో తమకూ గుర్తింపు తీసుకొచ్చారని వివరించారు. వైకాపా ప్రభుత్వం వెరిఫికేషన్ పేరుతో సంక్షేమ ఫలాలకు దూరం చేసి తమ జీవితాలను మళ్లీ చీకట్లోకి నెట్టేసిందని వర్షిణి ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడులో ఆమె మాట్లాడారు. ‘అనేక ఏళ్లుగా ప్రజల కోసం పోరాడుతున్న ప్రతినిధులు పాల్గొన్న ఇలాంటి వేదికపై నాకు మాట్లాడే అవకాశం కల్పించడం గొప్ప విషయం. చేయని తప్పులకు ఎన్నో ఛీత్కారాలు, విమర్శలు, నిందలు.. కన్నీళ్లు, బాధలు, అవమానాలు జీవితాంతం మోస్తున్న సాధారణ కుటుంబంలో పుట్టిన ట్రాన్స్జెండర్ నేను. మాలాంటి వారికి గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. పీఏగా నాకు అవకాశం కల్పించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవికి రుణపడి ఉంటాను’ అని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.