
లఖ్‌నవూపై కీలక విజయం శ్రేయస్ మెరుపు సెంచరీ రాణించిన ప్రభ్‌సిమ్రన్ లఖ్‌నవూ ఐపీఎల్-19లో ఆరంభంలో ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదేనా అనిపించిన పంజాబ్ కింగ్స్ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడి ఆ అవకాశాలను... రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొట్టింది. శ్రేయస్ మెరుపు సెంచరీకి తోడు ప్రభ్‌సిమ్రన్ రాణించడంతో పరాజయాల పరంపరకు చెక్ పెడుతూ కీలక విజయాన్ని అందుకుంది. ఐపీఎల్-19లో ఆరంభంలో ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదేనా అనిపించిన పంజాబ్ కింగ్స్ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడి ఆ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు అదరగొట్టింది. శ్రేయస్ మెరుపు సెంచరీకి తోడు ప్రభ్‌సిమ్రన్ రాణించడంతో పరాజయాల పరంపరకు చెక్ పెడుతూ కీలక విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను ఓడించిన పంజాబ్.. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా అన్నది ఆదివారం జరిగే మ్యాచ్‌లపై ఆధారపడివుంది. పంజాబ్ నిలిచింది. ఓటమి బాటను వీడి అత్యావశ్యక విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ (101 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 5×6) అజేయ సెంచరీతో చెలరేగిన వేళ ఆ జట్టు 7 వికెట్ల తేడాతో లఖ్‌నవూను ఓడించింది. మొదట లఖ్‌నవూ 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (72; 44 బంతుల్లో 9×4, 2×6) టాప్ స్కోరర్. ఆయుష్ బదోని (43; 18 బంతుల్లో 5×4, 3×6), సమద్ (37 నాటౌట్; 20 బంతుల్లో 3×4, 3×6) కూడా రాణించారు. చాహల్ (2/25), యాన్సెన్ (2/33) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో శ్రేయస్ శతకానికి, ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69; 39 బంతుల్లో 7×4, 2×6) దూకుడు తోడవడంతో పంజాబ్ 18 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. శ్రేయస్, ప్రభ్‌సిమ్రన్ జోరు: ఛేదనలో పంజాబ్ కూడా ఆరంభంలో లఖ్‌నవూ ఇన్నింగ్స్నే తలపించింది. షమి పదునైన బంతులతో విజృంభించడంతో పంజాబ్ 22 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫామ్‌లో ఉన్న ప్రియాంశ్ (0)ను ఔట్ చేసిన షమి.. తర్వాత కనోలీ (18) వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ స్థితిలో ప్రభ్‌సిమ్రన్, కెప్టెన్ శ్రేయస్ పంజాబ్‌ను ఆదుకున్నారు. వీళ్లిద్దరూ కుదురుకుని ధాటిగా ఆడడంతో పంజాబ్ స్కోరు పరుగులెత్తింది. అర్జున్ తెందుల్కర్ వేసిన ఎనిమిదో ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 6, 4.. శ్రేయస్ ఓ ఫోర్ కొట్టడంతో 9 ఓవర్లకు పంజాబ్ 94/2తో నిలిచింది. 28 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్, 33 బంతుల్లో శ్రేయస్ అర్ధసెంచరీలు అందుకున్నారు. ఈ జంట అదే జోరు కొనసాగించడంతో సమీకరణం (42 బంతుల్లో 58) అందుబాటులోకి వచ్చేసింది. పంజాబ్ లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న స్థితిలో అర్జున్ ఓ చక్కని యార్కర్ లెంగ్త్ బంతితో ప్రభ్‌సిమ్రన్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. కానీ శ్రేయస్ నాటకీయతకు అవకాశం ఇవ్వలేదు. షమి వేసిన 16వ ఓవర్లో మూడు సిక్స్‌లు బాది పంజాబ్‌ను లక్ష్యానికి చేరువ చేశాడు. మోసిన్‌ఖాన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతికి శ్రేయస్ సిక్స్‌తో జట్టును గెలిపించడమే కాక.. 51 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ కెరీర్లో అతడికి ఇదే తొలి శతకం. నిలిచిన ఇంగ్లిస్: అంతకుముందు లఖ్‌నవూ ఆరంభంలో తడబడినా.. తర్వాత పుంజుకుని 200కు చేరువగా స్కోరు చేయగలిగింది. ఓపెనర్ ఇంగ్లిసే ఇందుకు కారణం. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన అతడు.. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇంగ్లిస్ నాలుగు ఫోర్లు కొట్టి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ తర్వాత ఎల్ఎస్జీ రెండు ఓవర్ల వ్యవధిలో అర్షిన్ (0), పూరన్ (2) వికెట్లు చేజార్చుకుంది. అర్షిన్ను ఒమర్జాయ్ ఔట్ చేస్తే.. పూరన్‌ను యాన్సెన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ స్థితిలో బదోని దూకుడుగా ఆడాడు. అతడు ఫోర్లు, సిక్స్‌ల వేటలో సాగడంతో 3 ఓవర్లకు 20/2తో ఉన్న లఖ్‌నవూ.. పవర్‌ప్లే ఆఖరికి 66/2తో బలంగా పుంజుకుంది. జోరు మీదున్న బదోనిని చాహల్ బుట్టలో వేసినా.. ఇంగ్లిస్ దూకుడు కొనసాగించాడు. ధాటిగా షాట్లు ఆడి 28 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ (26) నుంచి అతడికి మంచి సహకారం అందింది. సెంచరీ చేసేలా కనిపించిన ఇంగ్లిస్ ఔట్ కావడంతో స్కోరు నెమ్మదించింది. 18, 19 ఓవర్లలో 10 పరుగులే వచ్చాయి. కానీ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో సమద్ ధాటిగా ఆడి స్కోరు 200కు సమీపంగా తీసుకెళ్లాడు. పంజాబ్, కోల్‌కతా ఆశలన్నీ ముంబయిపైనే. ఆదివారం రాజస్థాన్‌ను ముంబయి ఓడిస్తే ఆ రెండు జట్లు రేసులోకి వస్తాయి. లేదంటే 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ ముందంజ వేస్తుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడితే పంజాబ్‌కు మెరుగైన అవకాశం ఉంటుంది. ఇప్పటికే 15 పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్ కలిగివున్న ఆ జట్టును
Summary status: pending