
ఇంటర్నెట్ డెస్క్: సంచలన ఆటతీరుతో క్రికెట్ అభిమానులను అలరిస్తోన్న వైభవ్ సూర్యవంశీ మరోసారి చెలరేగిపోయాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై 29 బంతుల్లో 97 పరుగులు చేసి శభాష్ అనిపించాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ సెంచరీని చేసే అవకాశం కొద్దిలో చేజారింది. అయితే, సెంచరీ కంటే జట్టుకు తన ఇన్నింగ్స్ ఉపయోగపడితే చాలని వైభవ్ తెలిపాడు. ప్రత్యర్థులు ఎన్ని ప్రణాళికలతో వచ్చినా తన ప్లాన్స్ తనకుంటాయని వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన అతడి వద్దే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ కూడా ఉంది. ఇప్పుడు వైభవ్ ఖాతాలో 680 పరుగులు ఉన్నాయి. ‘‘మ్యాచ్ గెలిచినప్పుడు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాం. తర్వాత మ్యాచ్‌లో ఎలా ఆడాలనే దానిపైనే దృష్టిపెడతాం. క్వాలిఫయర్స్ 2లోనూ ఇదే దూకుడుగా ఆడి ఫైనల్‌కు చేరుకొనేందుకు ప్రయత్నిస్తాం. అయితే, రాబోయే పోరు గురించి మరీ ఎక్కువగా ఆలోచించను. మైదానంలోకి దిగిన తర్వాతనే నా ఆట ఏంటో ఆడతా. కానీ, సన్నద్ధత కోసం ఏం చేయాలనే దానిపై మాత్రం ఫోకస్ పెడతా. ప్రత్యర్థి బౌలర్లు ఎవరు? ఈ పిచ్‌పై ఎలా ఆడాలి? బౌండరీలు ఎంత పెద్దవి? ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తా. పాజిటివ్ కోణంలో ఆటడం మొదలుపెడితే ఆటోమేటిక్‌గా బౌలర్లు ఒత్తిడికి గురవుతారు. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తా. కొద్దిలో సెంచరీ మిస్ కావడం బాధించినా.. అది వేగవంతమైన శతకం అవుతుందనే విషయం మాత్రం నాకు ఔటైన తర్వాతనే తెలిసింది. నా కోచ్‌లు ఎప్పుడైనా సరే నన్ను చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమని చెబుతారు. ఎలాంటి ఒత్తిడిని తీసుకోవద్దని సూచించారు. నేను ఔటైన బంతి కూడా మిస్టైమ్ అయింది. లేకపోతే కచ్చితంగా బౌండరీ రావాల్సిన బంతి అది. ఫీల్డర్‌ను కొద్దిలో సెంచరీ మిస్ కావడం బాధించినా.. అది వేగవంతమైన శతకం అవుతుందనే విషయం మాత్రం నాకు ఔటైన తర్వాతనే తెలిసింది. నా కోచ్‌లు ఎప్పుడైనా సరే నన్ను చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయమని చెబుతారు. ఎలాంటి ఒత్తిడిని తీసుకోవద్దని సూచించారు. నేను ఔటైన బంతి కూడా మిస్టైమ్ అయింది. లేకపోతే కచ్చితంగా బౌండరీ రావాల్సిన బంతి అది. ఫీల్డర్‌ను చూసిన తర్వాతనే ఆ షాట్ కొట్టా. సరైన టైమింగ్ లేకపోవడం వల్ల క్యాచ్‌గా వెళ్లింది. సెంచరీలు వస్తూనే ఉంటాయి. కానీ, ట్రోఫీని గెలవడమనేదే కీలకం. నా బ్యాటింగ్‌లో ఎక్కడైనా కాస్త ఇబ్బందిగా అనిపిస్తే.. వెంటనే దానిపై వర్కౌట్ చేస్తా. ప్రత్యర్థుల ప్లాన్లు ఏవో వారికి ఉంటే.. నా ప్రణాళికలు కూడా నాకుంటాయి. నా సహజమైన ఆటతీరును ప్రదర్శించేందుకే ప్రయత్నిస్తున్నా’’ అని వైభవ్ వెల్లడించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.