
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన పలు డ్రోన్లను కూడా అమెరికా సైన్యం కూల్చివేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి (US Iran war). ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం దాడి చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరానియన్ డ్రోన్లను కూడా కూల్చివేసినట్టు అమెరికా సైన్యం పేర్కొంది. కాగా, ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. (US airstrikes Iran). తాజా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇవి ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది (US Iran conflict 2026). మరోవైపు అమెరికా మాత్రం ఈ దాడులు పూర్తిగా ఆత్మరక్షణ చర్యలు అని స్పష్టం చేసింది. అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.. Home » International » uae » US Launches Fresh Strikes In Iran, Intercepts Drones Near Strait Of Hormuz sgr ABN , Publish Date - May 28 , 2026 | 07:51 AM