
మ్యాచ్ మారినా, వేదిక మారినా సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ జోరు మాత్రం తగ్గడం లేదు. మరోసారి అసాధారణ ఆట కనబర్చిన అతను ఈ క్రమంలో వరుసగా రికార్డులు కొల్లగొడుతూ పోయాడు. ఐపీఎల్-2026లో భాగంగా బుధవారం ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ విధ్వంసం సృష్టించాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్లో సిక్స్‌తో దూకుడు మొదలు పెట్టిన అతను మలింగ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. ఆపై కమిన్స్ మరుసటి ఓవర్లో ఒక ఫోర్, ఆపై వరుసగా మూడు సిక్సర్లు బాది వైభవ్ తానేంటో చూపించాడు. సాకిబ్ వేసిన తర్వాత ఓవర్లో అతను కొత్త రికార్డు సృష్టించాడు. తొలి సిక్స్‌తో గేల్‌ను సమం చేసిన వైభవ్, తర్వాతి సిక్స్‌తో గేల్‌ను అధిగమించాడు. మూడో సిక్స్‌తో 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లో అతను ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో సురేశ్ రైనా (2014) రికార్డు సమం చేశాడు. ఐపీఎల్ మ్యాచ్ పవర్‌ప్లేలో అత్యధిక సిక్స్‌లు (8) కొట్టిన ఘనత కూడా వైభవ్‌దే అయింది. ఆ తర్వాత కూడా అతను తగ్గలేదు. అర్ధ సెంచరీ తర్వాత ఆడిన 12 బంతుల్లో అతను 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో మరో 43 పరుగులు రాబట్టాడు. సాకిబ్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన తర్వాత హింగే ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో గేల్ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నంచి క్యాచ్ May 28 2026 8:45 AM | Updated on May 28 2026 9:16 AM వరుసగా 4, 4, 6, 6 బాది అతను 97కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి 3 పరుగులు రాబడితే ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో గేల్ పేరిట) రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నంచి క్యాచ్ ఇవ్వడంతో 29వ బంతికి అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. సూర్యవంశీ ఔటయ్యాక మైదానాన్ని వీడడానికి ఇష్టపడలేదు. అనవసర షాట్ ఆడి ఔటైనన్న బాధతో అతడు కాసేపు మైదానంలోనే ఉండిపోయాడు. ఇక ఫాస్టెస్ట్ సెంచరీ మిస్ అవ్వడంపై వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు చేశాడు. "నిజానికి ఆ షాట్ ఆడే సమయంలో నా సెంచరీ గురుంచి అసలు ఆలోచించలేదు. కానీ ఫీల్డర్‌ను చూసిన తర్వాత నా మైండ్ మార్చుకున్నాను. అందుకే నా టైమింగ్ తప్పింది. ఒకవేళ నేను ముందు అనుకున్నట్టుగా 'థర్డ్ మ్యాన్' దిశగా ఆ షాట్ ఆడి ఉంటే, బంతి ఈజీగా బౌండరీ లైన్ దాటిపోయేది. కానీ నేను బంతిని స్ట్రైయిట్‌గా కొట్టడానికి ప్రయత్నించాను. అదే నేను చేసిన తప్పు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో ఔట్ అవ్వాల్సి వచ్చింది" అని ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో వైభవ్ పేర్కొన్నాడు. అదేవిధంగా సన్‌రైజర్స్ తో జరిగిన నాకౌట్ మ్యాచ్‌కు ముందు ఎలాంటి ఒత్తిడి తీసుకోవద్దని రాజస్తాన్ కోచ్‌లు అందరూ తనకు చెప్పారని సూర్యవంశీ వెల్లడించాడు. కాగా వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌ను గాను ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: అతడి బ్యాటింగ్ చూసి భయపడ్డాం.. మా ఓటమికి కారణమిదే: కమిన్స్ వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు) ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు) వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు) 'సమ్మర్ హాలీడేస్' సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు) ఈ బుక్లెట్ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్ జగన్ (ఫొటోలు) హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు