
‘యూనివర్సల్ బాస్’.. సిక్స్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించే క్రిస్ గేల్‌కు అభిమానులు పెట్టిన ముద్దుపేరు. 14 ఏళ్ల కిందట అతడు ఐపీఎల్లో పెను సంచలనం సృష్టించాడు. ఒకే ఎడిషన్‌లో 59 సిక్స్‌లు బాదాడు. అప్పుడు అతడి వయసు 33 ఏళ్లు. అబ్బో ఈ రికార్డును ఇంకెవరూ బద్దలు కొట్టలేరని చాలామంది భావించారు. క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టే ప్లేయర్ భూమి మీదకు వచ్చి అప్పటికే ఏడాది అయింది. కానీ, ఆ విషయం అభిమానులకు 15 ఏళ్లకు తెలిసింది. దూకుడైన ఆటతో ఒకే ఎడిషన్‌లో (65*) అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించి.. ‘యూనివర్స్ బేబీ బాస్’గా మారాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఈ కుర్రాడు కొడితే బంతి స్టాండ్స్లోనికే అని నిరూపించాడు. సాధారణంగా 14 లేదా 15 ఏళ్ల వయసులోని పిల్లలు ఏం చేస్తారు? వీడియో గేమ్ లేదా స్నేహితులతో ఆడుకుంటూ కనిపిస్తారు. కానీ, ఈ పాలబుగ్గల చిచ్చరపిడుగు మాత్రం ‘స్టార్’ బౌలర్లను బాదేయడమే ఇష్టమని తన ‘బ్యాటింగ్’తో సమాధానం ఇస్తున్నాడు. అందుకు తాజా నిదర్శనం ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో చితక్కొట్టడమే. మూడు ప్లాన్స్‌తో బరిలోకి దిగామని చెప్పిన కమిన్స్‌నే టార్గెట్ చేయడం గమనార్హం. 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్.. క్యాచ్ ఔట్ కాకుండా.. ఆ ఒక్క బౌండరీ కొట్టి ఉంటే ‘క్రిస్ గేల్’ మరో రికార్డు (ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ) తుడిచిపెట్టుకుపోయేదే. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ 12 సిక్స్‌లు, 5 ఫోర్లు అంటే.. 92 రన్స్ కేవలం బౌండరీల ద్వారానే రాబట్టాడు. అందుకేగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పెద్ద స్క్రీన్‌పైన యూనివర్స్ బేబీ బాస్ అంటూ పేరు రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ప్రస్తుతం అతడి మూడు ప్లాన్స్‌తో బరిలోకి దిగామని చెప్పిన కమిన్స్‌నే టార్గెట్ చేయడం గమనార్హం. 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన వైభవ్.. క్యాచ్ ఔట్ కాకుండా.. ఆ ఒక్క బౌండరీ కొట్టి ఉంటే ‘క్రిస్ గేల్’ మరో రికార్డు (ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ) తుడిచిపెట్టుకుపోయేదే. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ 12 సిక్స్‌లు, 5 ఫోర్లు అంటే.. 92 రన్స్ కేవలం బౌండరీల ద్వారానే రాబట్టాడు. అందుకేగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పెద్ద స్క్రీన్‌పైన యూనివర్స్ బేబీ బాస్ అంటూ పేరు రావడంతో అభిమానుల సందడి మామూలుగా లేదు. ప్రస్తుతం అతడి వద్దే పర్పుల్ క్యాప్ ఉంది. వైభవ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు 15 మ్యాచుల్లో 630 పరుగులు చేశాడు. ఇందులో 65 సిక్స్‌లు, 55 ఫోర్లు.. అంటే 610 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే రావడం గమనార్హం. 14 ఏళ్ల వయసులో తొలిసారి ఐపీఎల్లో అడుగు పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. బిహార్‌కు చెందిన వైభవ్‌ను తొలిసారి ఓ నెట్ ప్రాక్టీస్‌లో ఆ రాష్ట్ర స్పిన్నర్ సమర్ ఖాద్రి చూశాడట. అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా ఉన్నాడు. వెంటనే ఆర్ఆర్ డైరెక్టర్ జుబిన్ భారుచాకు ఖాద్రి ఈ విషయాన్ని చెప్పాడు. ట్రయల్స్‌లో వైభవ్ ఆటను చూసి కుర్రాడికి ఛాన్స్ ఇవ్వాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో 2025 ఐపీఎల్‌కు ముందు వేలంలో రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసుకుంది. ఆ సీజన్లో కేవలం ట్రైలర్ మాత్రమే చూపించిన వైభవ్.. ఇప్పుడు ‘బాయ్ మాన్స్టర్’గా విశ్వరూపం చూపిస్తుండటం గమనార్హం. వైభవ్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి ప్రణాళికలు వేసుకొచ్చినా తనకు అనవసరం అంటాడు. తన ప్లాన్ ఏంటో తనకు ఉందంటాడు. ఇలాంటి యువ సంచలన ప్లేయర్ ఆట చూసి దిగ్గజ క్రికెటర్లే సర్ప్రైజ్ అయ్యారు. తాజాగా సచిన్ తెందుల్కర్ కూడా వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. యార్కర్లను ఎదుర్కొనేందుకు అతడి పాదాల కదలిక చాలా బాగుందన్నాడు. రికార్డు సెంచరీ మిస్ అయినా.. అద్భుత ఇన్నింగ్స్‌లకు ఇది ఏమాత్రం తీసిపోదు. ఐపీఎల్లో ఇప్పటికీ క్రిస్ గేల్‌కు చెందిన చాలా రికార్డులు పదిలంగానే ఉన్నాయి. ఇప్పుడు సిక్స్‌ల ఘనతను వైభవ్ అధిగమించాడు. ఐపీఎల్లో 200+ స్కోరు కొడతానని సూర్యవంశీ ఓ సందర్భంలో అన్నాడు. కాస్తలో ఫాస్టెస్ట్ సెంచరీని మిస్ చేసుకున్న అతడు.. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆ లోటును పూరించే అవకాశం లేకపోలేదు. క్రిస్ గేల్ (175) అత్యధిక వ్యక్తిగత స్కోరును కొట్టే సత్తా ఇప్పుడున్న క్రికెటర్లలో వైభవ్‌కే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో 68 పరుగులు చేస్తే అతిపిన్న వయసులో ఐపీఎల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా వైభవ్ (932) నిలుస్తాడు. ఈ 932 పరుగుల్లో 826 పరుగులు కేవలం బౌండరీల (89 సిక్స్‌లు, 73 ఫోర్లు) రూపంలోనే వచ్చాయంటూ వైభవ్ షాట్స్ ఏ రేంజ్లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి