
అమరావతి: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కొనియాడారు. సినీరంగంలో రాముడు, కృష్ణుడిగా కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రజాసేవ కోసం సినీరంగాన్ని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానేత ఎన్టీఆర్ అన్నారు. కాంగ్రెస్ అహంకార రాజకీయాలకు ఎదురొడ్డి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడన్నారు. 202 సీట్లతో విజయం సాధించి ప్రాంతీయ పార్టీలకు కొత్త దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేసి సంక్షేమ పాలనకు నాంది పలికారన్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఎన్టీఆర్ లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారత కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించి, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అండగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. మంత్రి లోకేశ్ యువత కోసం యువగళం పాదయాత్ర చేసి ప్రజల్లో నమ్మకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.