
చేవెళ్ల: ఆభరణాల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని ఈర్లపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి అనుబంధ గ్రామమైన ధర్మసాగర్‌కు చెందిన ఎరుకుల మైసమ్మ(48)కు ముప్పై ఏళ్ల కిందట వివాహమైంది. అనంతరం కొన్నేళ్లకు ఆమె భర్త చనిపోయాడు. దీంతో కొడుకు సురేశ్‌తో కలిసి ఆమె ధర్మసాగర్‌లోనే ఉంటుంది. కొడుకుకి వివాహం కావటంతో వేర్వేరుగా ఉంటున్నారు. మైసమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. బుధవారం మధ్యాహ్నం ఈర్లపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేçహాన్ని గుర్తించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించి మైసమ్మగా నిర్ధారించారు. దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోని తీసుకెళ్లి గొంతు కోసి రెండు కాళ్లను నరికి 50 తులాల కడియాలు, చెవి కమ్మలు దోచుకెళ్లారు. తాగిన మైకంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భూపాల్‌శ్రీధర్ తెలిపారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. మోదీతో విజయ్.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న (ఫొటోలు) బ్లాక్ డ్రెస్‌లో ప్రెట్టీ లుక్‌లో ప్రగ్యా జైస్వాల్ (ఫోటోలు) ‘ఆపద్బాంధవుడు’ మూవీ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి ఇప్పుడు ఇలా...(ఫొటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫొటోలు) ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సినిమా టీజర్ ఆవిష్కరణ (ఫొటోలు) హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ DK శివకుమార్ అనే నేను నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..? బాబు లోకేష్ ని ఇమిటేట్ చేసిన కొడాలి నాని ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి May 28 2026 11:54 AM | Updated on May 28 2026 11:56 AM సిగ్గులేకుండా మహానాడుకు, స్త్రీ శక్తి అని పెట్టుకున్నారు