
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చైనా పర్యటన తర్వాత మళ్లీ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. పాక్, చైనా కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించాయి. ‘చరిత్రలో మిగిలిన సమస్య(left over from history)’ అంటూ UN తీర్మానాల ప్రకారం పరిష్కారం కావాలని పేర్కొన్నాయి. అయితే, షరీఫ్.. చైనా పర్యటనలో ఏం జరిగిందనే అంశాలపై చర్చ మొదలైంది. భారత్‌పై కుట్రతో రెండు దేశాలు ఏం ప్లాన్ చేశాయనే చర్చ జోరందుకుంది. మరోవైపు.. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జమ్ముకశ్మీర్, లడఖ్ భారత్‌లో అంతర్భాగాలని స్పష్టం చేసింది. పాక్ పీఎం షరీఫ్ నాలుగు రోజుల చైనా పర్యటనలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు ఉన్నతాధికారులతో విస్తృత చర్చలు జరిపారు. అధికారికంగా ఈ భేటీల్లో CPEC (చైనా–పాకిస్థాన్ ఆర్థిక కారిడార్) విస్తరణ, గ్వాదర్ పోర్ట్‌ను ప్రాంతీయ ట్రేడ్ హబ్‌గా అభివృద్ధి చేయడం, రక్షణ సహకారం, ఆర్థిక పెట్టుబడులు ప్రధాన అంశాలుగా ఉన్నప్పటికీ అసలు వ్యూహాత్మక చర్చలు భిన్నంగా ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రకటనలో కశ్మీర్‌ను మళ్లీ ప్రస్తావించడం వెనుక చైనా–పాక్ ఉమ్మడి వ్యూహం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ దీర్ఘకాలంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. చైనా మద్దతుతో ఆ ప్రయత్నానికి కొత్త ఊపొచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్ పెరుగుతున్న ఆర్థిక, సైనిక ప్రభావాన్ని కట్టడి చేయడం ఈ వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. ఇక చైనా వైపు నుంచి చూస్తే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో కీలక భాగమైన CPEC భద్రత అత్యంత ప్రాధాన్యం. గిల్గిట్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే ఈ కారిడార్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ బీజింగ్ ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు May 28 2026 11:39 AM | Updated on May 28 2026 11:39 AM ఇక చైనా వైపు నుంచి చూస్తే, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో కీలక భాగమైన CPEC భద్రత అత్యంత ప్రాధాన్యం. గిల్గిట్–బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళ్లే ఈ కారిడార్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ బీజింగ్ ఆ ప్రాంతాల్లో పెట్టుబడులు పెంచుతూ, గ్వాదర్ పోర్ట్‌ను అరేబియా సముద్రంలో వ్యూహాత్మక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ పరిణామాల వెనుక “కనిపించని ఒత్తిడి వ్యూహం” ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కశ్మీర్ అంశాన్ని మళ్లీ మళ్లీ లేవనెత్తడం ద్వారా భారత్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచడం, అంతర్జాతీయ వేదికల్లో చర్చను కొనసాగించడం పాక్ లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా ఈ అంశాన్ని నేరుగా రాజకీయంగా కాకుండా, వ్యూహాత్మక భాగస్వామ్యం రూపంలో ఉపయోగిస్తోందని భావిస్తున్నారు. India has firmly rejected Pakistan-China references on Jammu & Kashmir. 🇮🇳 “No other country has the locus standi to comment.” MEA makes it crystal clear: Jammu & Kashmir and Ladakh “have been, are and will always remain integral and inalienable parts of India.” https://t.co/NTzHeyiCGh pic.twitter.com/ZJs2lpnW15 — India First Post (@ifpost47) May 26, 2026 అయితే, భారత్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా తిరస్కరించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ దేశానికి అంతర్భాగాలని స్పష్టం చేస్తూ, ఇతర దేశాలు ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి ఎలాంటి హక్కు లేదని విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. అంతేకాకుండా CPEC ప్రాజెక్ట్‌ను భారత సార్వభౌమాధికారానికి విరుద్ధంగా పేర్కొంటూ దీర్ఘకాల అభ్యంతరాన్ని పునరుద్ఘాటించింది. మొత్తం పరిణామాన్ని పరిశీలిస్తే, ఇది కేవలం ప్రకటన స్థాయిలో జరిగిన వ్యాఖ్యల కంటే ఎక్కువగా చైనా–పాక్ వ్యూహాత్మక సమన్వయాన్ని సూచిస్తోందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు ఆర్థిక కారిడార్ విస్తరణ, మరోవైపు దౌత్య వేదికలపై కశ్మీర్ ప్రస్తావన ద్వారా భారత్‌పై “డబుల్ ప్రెషర్ స్ట్రాటజీ” అమలు చేస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉందని, భారత్–చైనా–పాక్ మధ్య సంబంధాలు మరింత సంక్లిష్ట దశలోకి వెళ్లినట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. UN తీర్మానాల చరిత్ర 👉1948లో UNSC Resolution 47 ద్వారా కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చారు. ఆ తీర్మానం ప్రకారం, పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలి, భారత్ సైన్యం తగ్గించుకోవాలి. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ (plebiscite) జరగాలి. కానీ, అమలు జరగలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ అంశం UNలో పునరావృతమవుతూ వస్తోంది. భారత్ ఆందోళనలు 👉China–Pakistan Economic Corridor (CPEC) ప్రాజెక్టులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) మీదుగా వెళ్తున్నాయి. భారత్ దీన్ని సార్వభౌమత్వానికి విరుద్ధంగా భావిస్తోంది. గ్వాదర్ పోర్ట్ అభివృద్ధి, రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు అన్నీ చైనా–పాకిస్తాన్ సంబంధాలను బలపరుస్తున్నాయి. దీని వల్ల భారత్‌కి వ్యూహాత్మకంగా ఒత్తిడి పెరుగుతోంది. చైనా–పాకిస్తాన్ కశ్మీర్‌ను అంతర్జాతీయ వేదికల్లో మళ్లీ ప్రస్తావించడం భారత్‌ను ఇరకాటంలో పడేస్తోంది.