అవన్నీ నాకు తెలీదు.. నాకు డబ్బు కచ్చితంగా కావాలి.. ఆ డబ్బు కోసమే నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను.. నా ఇంటిని వదిలేసి నీకోసం ఇక్కడ నటిస్తున్నాను.. నువ్వు చెప్పావ్ అని తాళి కట్టాను.. నువ్వు చెప్పావ్ అద్దె మొగుడిలా నటిస్తున్నా.. నువ్వు చెప్పావ్ అని ఆఫీస్‌కి వచ్చా.. నువ్వు చెప్పావ్ అని సీఈవో అని నాటకం ఆడి రేఖ దగ్గర ఇరుక్కుంటున్నాను.. నాకు డబ్బు చాలా అర్జెంట్.. ఆ డబ్బు కావాల్సిందే.. అవతల నాకు చాలా పని ఉంది.. టైం లేదు ఇవ్వు అని రాజు అంటాడు. నేను నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు.. నీ ఈగో చల్లారకపోతే నన్ను కొట్టు.. కావాలంటే నాది నేనే చెంపలు వాయించుకుంటాను.. ఇంకా నీ ఈగో చల్లారకపోతే కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అని రాజు అంటాడు. నీకు నిజంగానే అవసరం ఉంది అని నమ్ముతున్నా.. కాకపోతే అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు అని ఇందు అంటుంది. దీంతో రాజుకి మరింత కోపం వస్తుంది. దీంతో ఈ నాటకానికి స్వస్తి చెబుతాను అని ఇందుతో రాజు అంటాడు. డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ టైపులో చేస్తాడు రాజు. నువ్వు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నేను నటించడం ఆపేస్తాను.ఇది బ్లాక్ మెయిల్ అనుకుంటావో.. ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం.. నేను ఒక పని కోసం డబ్బులు కావాలని ఇదంతా చేస్తున్నాను.. ఇప్పుడు ఆ పని కోసమే డబ్బులు రాకపోతే ఇదంతా చేసి వేస్ట్.. నీకు మళ్లీ నేను ఎప్పటికీ కనిపించను అని రాజు అంటాడు. దీంతో ఇందుకి ఏం చేయాలో పాలుపోదు. మెడలో తన అమ్మ గుర్తుగా వేసుకున్న గోల్డ్ చెయిన్ ఇస్తుంది. దీన్ని తాకట్టు నువ్వు ఇప్పుడు డబ్బు ఇవ్వకపోతే నేను నటించడం ఆపేస్తాను.ఇది బ్లాక్ మెయిల్ అనుకుంటావో.. ఇంకేమైనా అనుకుంటావో నీ ఇష్టం.. నేను ఒక పని కోసం డబ్బులు కావాలని ఇదంతా చేస్తున్నాను.. ఇప్పుడు ఆ పని కోసమే డబ్బులు రాకపోతే ఇదంతా చేసి వేస్ట్.. నీకు మళ్లీ నేను ఎప్పటికీ కనిపించను అని రాజు అంటాడు. దీంతో ఇందుకి ఏం చేయాలో పాలుపోదు. మెడలో తన అమ్మ గుర్తుగా వేసుకున్న గోల్డ్ చెయిన్ ఇస్తుంది. దీన్ని తాకట్టు పెట్టుకో.. అమ్మొద్దు.. డబ్బులు వచ్చాక విడిపించుకుందాం అని ఇచ్చేస్తుంది ఇందు. దీంతో గత్యంతరం లేక రాజు కూడా ఆ చెయిన్‌ను తీసుకుంటాడు. సారీ అమ్మ నన్ను క్షమించు.. నాకు ఇంకో దారి కనిపించడం లేదు అని ఇందు లోలోపల బాధపడుతూ ఉంటుంది. మరో వైపు వెంకీ ఓ ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. సర్టిఫికెట్లు చూస్తుంటే మెరిట్ స్టూడెంట్‌లానే ఉన్నారు. ఇతర క్వాలిఫికేషన్స్, ఏఐ మీద నాలెడ్జ్ ఉందా? అని అడుగుతారు. అవుట్ పుట్ మాకు ముఖ్యం, టెక్నాలజీ గురించి తెలీదు కదా.. మీరు ఈ జాబ్‌కి సరిపోరు.. ఇప్పుడంతా కూడా ఏఐ మీదే నడుస్తోంది.. ఇక మీరు వెళ్లొచ్చు అని అనడంతో వెంకీ నిరుత్సాహంతో బయటకు వెళ్లిపోతాడు. ఇంకో వైపు ఇందు ఇచ్చిన చెయిన్‌ను రాజు తాకట్టు పెట్టడానికి మార్వాడీ షాప్‌కి వెళ్తాడు. పెళ్లై, దొంగతనాలు మానేశావ్ అంటే.. మంచిదే అని ఆ షాప్ ఓనర్ అంటాడు. నాకు డెబ్బై వేలు ఇవ్వు అని రాజు అంటే.. ఆ షాపు వాడు 50 వేలు ఇస్తానని అంటాడు.. అయితే మధ్యలో డాక్టర్ ఫోన్ చేసి మరింతగా వార్న్ చేస్తుంటాడు. దీంతో ఆ యాభై వేలు పట్టుకుని హాస్పిటల్‌కి వెళ్తాడు. అక్కడ ఆ డబ్బు కట్టేస్తాడు. కండీషన్ చాలా వరెస్ట్‌గా ఉంది.. ఇలా లేటుగా పేమెంట్ చేయకండని డాక్టర్ చెబుతాడు. ప్రాణాలకు ప్రమాదం లేదు కానీ.. కోలుకునేందుకు టైం పడుతుందని చెప్పి వెళ్తాడు డాక్టర్. నువ్వేం కంగారు పడకు.. నీకేం కాదు.. నిన్ను కాపాడుకుంటాను.. దాని కోసం నేను ఏమైనా చేస్తాను.. ఎన్ని అవమానాలైనా భరిస్తాను.. మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత.. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఐసీయూ ముందు నిలబడి రాజ్ తనలో తాను అనుకుంటాడు. ఐసీయూలో ఉన్నది ఎవరు అనేది చూపించకుండా ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకో వైపు వెంకీ ఇంటర్వ్యూలు అంటూ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంటాడు. ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటాను.. జాబ్ ఇవ్వండని రిక్వెస్టులు చేస్తుంటాడు. స్కిల్స్ ఉన్న వాళ్లకే జాబులు రావడం లేదు.. నీకు జాబ్ ఇచ్చి స్కిల్స్ నేర్పించం.. వెళ్లండని వెంకీని బయటకు పంపిస్తారు. ఏఐకి ఉన్న వాల్యూ మనిషికి లేకుండా పోతోందని వెంకీ లోలోపల బాధ పడుతుంటాడు. ఇక ఇంట్లోకి వచ్చి కూర్చున్న రాజుని చూసి ఇందు ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. నీకు డబ్బు అంతగా అవసరం ఎందుకు పడింది? ఆ పని ఏంటో నాకు చెప్పు అని ఇలా అడుగుతూ ఉంటుంది. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని రాజు అంటాడు. నాకు