
ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన పోరులో సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధారాళంగా పరుగులు సమర్పించాడు. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 పరుగులు ఇవ్వడం గమనార్హం. ఇటు బ్యాటింగ్‌లోనూ పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే, ఈ పిచ్‌పై 240+ లక్ష్యం ఛేదించడం పెద్ద కష్టమేం కాదని.. త్వరగా వికెట్లను కోల్పోవడమే తమ ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించాడు. ఇక, వైభవ్‌ను ఎదుర్కొనేటప్పుడు తమ వద్ద ఎక్కువ ఆప్షన్లు ఉన్నట్లు అనిపించలేదని కమిన్స్ అంగీకరించాడు. ‘‘వైభవ్ చాలా అద్భుతంగా ఆడాడు. అతడు అలా ఆడుతుంటే మా వద్ద మరిన్ని ఆప్షన్లు లేవని అనిపించింది. పిచ్ చాలా బాగుంది. కానీ, మార్జిన్స్ కాస్త చిన్నవే. ఒకవేళ యార్కర్ వేయడం మిస్ అయితే.. వైభవ్ ఏమాత్రం ఉపేక్షించడు. చాలా మంచి గేమ్. మా జట్టు ఇప్పుడు కుర్రాళ్లతో అద్భుతంగా ఉంది. ప్రఫుల్, సకిబ్ బాగా ఆడారు. అయితే, యువ ప్లేయర్లలో చాలా మందికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లలో మాదే యంగెస్ట్ టీమ్ అనుకుంటా. మా కోచింగ్ గ్రూప్ బాగా పనిచేసింది. వారిందరిని నడిపించడం కెప్టెన్‌గా ఆనందంగా ఉంది’’ అని కమిన్స్ తెలిపాడు. ‘‘ఛేజింగ్ తీసుకున్నందుకు చింతించడం లేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమే. కానీ, త్వరగా వికెట్లను కోల్పోవడంతో మాకు ఛేదన కష్టమైంది. స్కోరు బోర్డుపై 240+ లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండాలి. చివరి వరకూ మేం రన్‌రేట్‌ను బాగానే కొనసాగించినా.. వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. మా కుర్రాళ్ల ప్రతిభ వల్లే ఇదంతా. ఈసారి కూడా టాప్-2లోకి వచ్చేందుకు ప్రయత్నించాం. కానీ, ‘‘ఛేజింగ్ తీసుకున్నందుకు చింతించడం లేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమే. కానీ, త్వరగా వికెట్లను కోల్పోవడంతో మాకు ఛేదన కష్టమైంది. స్కోరు బోర్డుపై 240+ లక్ష్యం ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉండాలి. చివరి వరకూ మేం రన్‌రేట్‌ను బాగానే కొనసాగించినా.. వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాం. మా కుర్రాళ్ల ప్రతిభ వల్లే ఇదంతా. ఈసారి కూడా టాప్-2లోకి వచ్చేందుకు ప్రయత్నించాం. కానీ, వీలుపడలేదు. జట్టులోని ప్రతి ఒక్కరూ మంచి ఆటతీరు ప్రదర్శించారు. దీని గురించి వారినేమీ అడగాలని అనుకోవడం లేదు’’ అని కమిన్స్ వెల్లడించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.