
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ దెబ్బకు హేమాహేమీ బౌలర్లే గతి తప్పారు. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, రబాడ, మిచెల్ స్టార్క్.. ఇలా ప్రతి ఒక్కరిపైనా ఈ కుర్రాడు ఆధిపత్యం ప్రదర్శించాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లోనూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. దీంతో అతడిని ఎలా కట్టడి చేయాలనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇదే ప్రశ్న రాజస్థాన్ ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎదురైంది. దీనికి ఆర్చర్ ఆసక్తికరంగా బదులిచ్చాడు. ‘‘వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే.. మాకు డిఫెండ్ చేసుకోడానికి అన్ని ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తప్పకుండా 150+ మార్క్‌ను అందుకొంటాడు. చాలా మంది వైభవ్‌ను ఎలా కట్టడి చేయాలని అడుగుతున్నారు. అయితే, దానికి సమాధానం ఇప్పుడే చెప్పను. ఐపీఎల్ ముగిసిన తర్వాత చెబుతా’’ అని ఆర్చర్ వ్యాఖ్యానించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో వైభవ్‌తోపాటు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. నెట్స్‌లో వీరిద్దరూ ప్రాక్టీస్ కూడా చేస్తుంటారు. ‘‘వైభవ్‌లో ఉన్న అత్యుత్తమ లక్షణం.. ఏదీ ముందస్తుగా ప్లాన్ చేసుకోడు. అయితే, నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాడు. తన ఆటపై నమ్మకం పెట్టుకుంటాడు. ఏం సాధన చేస్తాడో.. దానినే మైదానంలోనూ చేసి చూపిస్తాడు. ఫలానా షాట్లు కొట్టడం కష్టమని ఎప్పుడూ అనుకోడు. క్రికెట్ అకాడమీకి వెళ్తే బౌలర్ ఎవరు అని చూడొద్దంటారు. మేం 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా బౌలర్ వైపు చూసేవాళ్లం. వైభవ్ మాత్రం అవేవీ పట్టించుకోడు. కేవలం బంతిపైనే అతడి దృష్టి ఉంటుంది. అదే అతడి సక్సెస్ మంత్ర’’ అని ధ్రువ్ ‘‘వైభవ్‌లో ఉన్న అత్యుత్తమ లక్షణం.. ఏదీ ముందస్తుగా ప్లాన్ చేసుకోడు. అయితే, నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాడు. తన ఆటపై నమ్మకం పెట్టుకుంటాడు. ఏం సాధన చేస్తాడో.. దానినే మైదానంలోనూ చేసి చూపిస్తాడు. ఫలానా షాట్లు కొట్టడం కష్టమని ఎప్పుడూ అనుకోడు. క్రికెట్ అకాడమీకి వెళ్తే బౌలర్ ఎవరు అని చూడొద్దంటారు. మేం 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూడా బౌలర్ వైపు చూసేవాళ్లం. వైభవ్ మాత్రం అవేవీ పట్టించుకోడు. కేవలం బంతిపైనే అతడి దృష్టి ఉంటుంది. అదే అతడి సక్సెస్ మంత్ర’’ అని ధ్రువ్ జురెల్ వెల్లడించాడు. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీతోపాటు ధ్రువ్ జురెల్ (50) కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.