
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు జూన్ 1న నియోజకవర్గానికి 2 వేల చొప్పున రెండో విడత ఇళ్ల మంజూరు క్యూర్ పరిధిలో పేదలకు లక్ష గృహాలు వేగంగా పాలమూరు-రంగారెడ్డి భూసేకరణ గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు జూనియర్ కళాశాలల్లోనూ మధ... చిత్రంలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. పూరిగుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తీర్మానించింది. రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు జూన్ 1న నియోజకవర్గానికి 2 వేల చొప్పున రెండో విడత ఇళ్ల మంజూరు క్యూర్ పరిధిలో పేదలకు లక్ష గృహాలు వేగంగా పాలమూరు-రంగారెడ్డి భూసేకరణ గోదావరి పుష్కరాలకు రూ.వేయి కోట్లు జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం విద్యుత్ ఆర్డీఎస్ఎస్ పథకం అమలు మంత్రి పొంగులేటి వెల్లడి వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. పూరిగుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తీర్మానించింది. జూన్ 1 నుంచి ఇందిరమ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున మంజూరుకు అనుమతించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జరగాలని నిర్ణయించింది. సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానించింది. వివరాలను రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో కలిసి వెల్లడించారు. ‘‘కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులందరం అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం రాష్ట్రంలో 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని నిర్ణయించాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని సూచించింది. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు; గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందిస్తాం. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తాం. సొంత స్థలాలున్న వారికి రూ.ఐదేసి లక్షలు ఇస్తాం. తెలంగాణను 2030 నాటికి ఐదు ప్రపంచ శ్రేణి లైఫ్ సైన్సెస్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్ట్స్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని మంత్రిమండలి ఆమోదించింది. దావోస్‌లో సీఎం ఈ విధానాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఆవిష్కరణలపై దృష్టి సారిస్తాం. పరిశోధన, అభివృద్ధి యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ విధానంలో మార్పు తెచ్చాం. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది. పంట ఉత్పత్తుల కొనుగోలు...: మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రాష్ట్ర మంత్రి మండలి శనివారం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే 14.89 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతించింది. ఇంకా నిల్వలున్నందున అదనంగా 6,53,817 టన్నుల కొనుగోళ్లకు రూ.1,677 కోట్ల రుణం అవసరమని, దానికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని మార్క్‌ఫెడ్ ప్రతిపాదించగా ఆమోదం లభించింది. 2,76,277 టన్నుల జొన్న కొనుగోళ్లకు రూ.1,154.76 కోట్ల రుణం కోసం, 10,175 టన్నుల పొద్దుతిరుగుడు కొనుగోళ్లకు రూ.86.37 కోట్ల రుణం కోసం ప్రభుత్వ బ్యాంకు గ్యారంటీలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది’’ అని మంత్రి పొంగులేటి వివరించారు. విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలను ఆమోదించాం. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. గత ప్రభుత్వం 2017 జనవరి 2న అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. దీనిని అమలు చేయలేదు.
Summary status: pending