
ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మంచిర్యాల: ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు నిత్యం సరిపడా నీరు తాగటంతో పాటు వేసవిలో లభించే నీటి శాతం ఎక్కువ ఉండి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తరుచూ తినటం ద్వారా శరీరాన్ని చల్లబర్చటంతో పాటు ఇతర పోషకాలు సైతం అందుతాయని న్యూట్రిషీయన్స్ పేర్కొంటున్నారు. వేసవిలో కర్బూజను తరుచూ తీసుకోవటంతో శరీరం చల్లబడటంతో పాటు తక్షణ శక్తి అందుతుంది. మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలను సైతం దూరం చేస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. ఇక పండ్లలో రాజు మామిడి పండు వేసవిలో లభ్యమవుతుంది. వేసవిలో ఈ పండును తరుచూ తీసుకోవటంతో జీర్ణక్రియ మెరుగుపడటంతో పాలు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో తప్పకుండా తినాల్సిన అసలైన పండు పుచ్చకాయ. దీనిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వడదెబ్బ నుంచి రక్షిస్తోంది. మూత్రంలో కూడా మంటను తగ్గించటం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చటం వంటి మేలు జరుగుతుంది. నారింజ, ద్రాక్ష, అరటి పండ్లు, కీవీ, తాటి ముంజలు వంటి పండ్లను తరుచూ తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందే అవకాశాలున్నాయి. Home » Health » Hydrating Summer Fruits Packed With Nutrients Help Beat Heat and Improve Health ABN , Publish Date - May 28 , 2026 | 01:38 PM Read Latest AP News And Telangana News And International News And Telugu News