
యాదగిరిగుట్టలో భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకూ.. ఆలయంలో సమస్యల పరిష్కారానికి హామీ గురుకుల వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, విప్ బీర్ల అయిలయ్య, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ర... యాదగిరిగుట్టలో భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకూ.. ఆలయంలో సమస్యల పరిష్కారానికి హామీ గురుకుల వేద పాఠశాల నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, విప్ బీర్ల అయిలయ్య, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈనాడు, నల్గొండ, న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట, భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయనగరిలో 15 ఎకరాల విస్తీర్ణంలో 1.4లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న వేద గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం భూమిపూజ చేశారు. దీంతోపాటు మొత్తం రూ.99.55 కోట్లతో చేపట్టనున్న ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. తొలుత ప్రత్యేక హెలికాప్టర్లో ఉదయం 8.50 గంటలకు ఆలయ నగరి ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి వేద పాఠశాల ప్రాంగణానికి రాగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతిస్వామి వద్దకు వచ్చి ఆయన పాదుకలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రధాన పండితుల మంత్రోచ్చారణల మధ్య వేద పాఠశాల నిర్మాణానికి విజయేంద్ర సరస్వతిస్వామితో కలిసి సీఎం భూమి పూజ చేశారు. ఆలయంలో కల్పించే మౌలిక వసతులకు శిలాఫలకాలు ఆవిష్కరించిన అనంతరం సీఎంతో పాటు మిగిలిన వారికి సైతం వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం అక్కడి నుంచి కాన్వాయ్‌లో దేవస్థానానికి వెళ్లి పంచనారసింహులను దర్శించుకున్నారు. స్వామివారి సన్నిధిలో 35 నిమిషాలు ఉన్న సీఎం అనంతరం 11.05లకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు వెళ్లారు. యాదగిరిగుట్ట ఆలయనగరిని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని అత్యంత భక్తిశ్రద్ధలతో పనులు నిర్వహించేలా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాంగానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఆలయంలోని పలు అపరిష్కృత సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు అర్చకులు, అధికారులు తెలిపారు. కార్యక్రమాల్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రూ.43.79 కోట్ల అంచనా వ్యయంతో మూడు దశల్లో వేద పాఠశాలను నిర్మించనున్నారు. సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 500 మంది విద్యార్థులకు వసతితో కూడిన విద్య అందించనున్నారు. సముదాయంలో హోమాలు, యాగశాలలే కాకుండా గోశాల కూడా ఏర్పాటు చేయనున్నారు. రూ.9.86 కోట్లతో కొండపైన నిత్యకల్యాణ రంగ మండపం, వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి రూ.1.41 కోట్లతో పై కప్పు నిర్మాణం, రూ.1.34 కోట్ల అంచనాతో మాడవీధులకు కొత్త మెట్ల నిర్మాణ పనులు, రూ.43.15 కోట్లతో డార్మిటరీ హాళ్లు, దీక్షాపరుల సదనం నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విజయేంద్ర సరస్వతి ఆశీర్వచనం తీసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి సీఎం పర్యటన షెడ్యూల్లో మార్పులు, శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అధికారులు స్వాగతం పలకలేకపోయారు. రేవంత్‌రెడ్డి ముందుగా ఆలయానికి చేరుకుంటారని భావించి కలెక్టర్, ఎస్పీలతో పాటు ముఖ్య ప్రజాప్రతినిధులందరూ గుట్ట కింద హెలిప్యాడ్ వద్ద వేచి చూశారు. అనివార్య కారణాలతో సీఎం పర్యటన ఆలస్యమైందని నిఘా వర్గాలు యాదాద్రికి సమీపంలోకి రాగానే అధికారులకు తెలిపారు. వేద పాఠశాల భూమిపూజ ముహూర్త సమయం దాటిపోతుందని భావించిన సీఎం నేరుగా పెద్దగుట్టపైనున్న హెలిప్యాడ్ వద్ద దిగారు. అక్కడే ఏర్పాటు చేసిన కారవాన్లోనే పట్టువస్త్రాలు మార్చుకున్నారు. కొండ కింద వేచిచూస్తున్న అధికారులు వచ్చే లోపే సీఎం.. మంత్రులు, ఇతర స్థానిక నాయకులతో కలిసి నడుచుకుంటూ వేదపాఠశాల భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రొటోకాల్ ఉల్లంఘన, అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఉన్నతాధికారుల ఆదేశంతో కలెక్టర్ అనురాగ్ జయంతి.. ఆర్అండ్బీ ఈఈకి షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు, నివేదికను సమర్పించినట్లు అధికారిక వర్గాల సమాచారం. నిర్దేశిత ప్రదేశంలో కాకుండా మరోచోట హెలికాప్టర్ ల్యాండింగ్, ఆ తదుపరి కొంత సేపు సీఎం హెలికాప్టర్లోనే నిరీక్షించాల్సి రావడంపై సచివాలయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతా సిబ్బంది కొండపైకి భక్తులను రెండు గంటల పాటు అనుమతించకపోవడంతో కిందే ఎండలోనే వేచి చూశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార
Summary status: pending