
Vijay Kedia on LTCG | ఇంటర్నెట్ డెస్క్: లిస్టెడ్ ఈక్విటీల్లో పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ మదుపరి విజయ కేడియా ఈ అంశాన్ని తాజాగా లేవనెత్తారు. క్యాపిటల్ మార్కెట్ బలోపేతానికి ఈ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) పన్నును పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌లో ప్రపంచస్థాయి కంపెనీలు రూపుదిద్దుకోవాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం అని విజయ్ కేడియా అభిప్రాయపడ్డారు. ఎల్టీసీజీ పన్నును రద్దు చేస్తే దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు గొప్ప ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రస్తుత పన్ను విధానం స్వల్పకాలిక స్పెక్యులేటివ్ ట్రేడింగ్, దీర్ఘకాలిక పెట్టుబడులకు మధ్య వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేకపోతోందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక మదుపరి కేవలం మార్కెట్ లావాదేవీల్లో పాల్గొనే వ్యక్తి మాత్రమే కాదని, దేశ సంపద సృష్టిలో భాగస్వామి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కంపెనీ వృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను, కస్టమ్స్ డ్యూటీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని విజయ్ కేడియా అన్నారు. కాబట్టి ఆ కంపెనీల్లో పెట్టుబడులపై మళ్లీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలు తమ పొదుపు మొత్తాలను బంగారం వంటి వాటిల్లో కాకుండా ఉపాధిని సృష్టించే, దేశ సంపదను పెంచే ఉత్పాదక వ్యాపారాలవైపు మళ్లించేలా పన్ను విధానాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రపంచస్థాయి కంపెనీలు అవతరిస్తాయన్నారు. ఎల్టీసీజీ 2004 వరకు ఉండేది. అప్పట్లో దాన్ని రద్దు చేశారు. 2018లో తిరిగి తీసుకొచ్చారు. 2024 ఒక కంపెనీ వృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్ పన్ను, జీఎస్టీ, ఉద్యోగుల నుంచి ఆదాయపు పన్ను, కస్టమ్స్ డ్యూటీలు, స్టాంప్ డ్యూటీల రూపంలో భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోందని విజయ్ కేడియా అన్నారు. కాబట్టి ఆ కంపెనీల్లో పెట్టుబడులపై మళ్లీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను వేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలు తమ పొదుపు మొత్తాలను బంగారం వంటి వాటిల్లో కాకుండా ఉపాధిని సృష్టించే, దేశ సంపదను పెంచే ఉత్పాదక వ్యాపారాలవైపు మళ్లించేలా పన్ను విధానాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రపంచస్థాయి కంపెనీలు అవతరిస్తాయన్నారు. ఎల్టీసీజీ 2004 వరకు ఉండేది. అప్పట్లో దాన్ని రద్దు చేశారు. 2018లో తిరిగి తీసుకొచ్చారు. 2024 నుంచి మూలధన లాభాలపై 12.5 శాతం (రూ.1.25 లక్షల వరకు మినహాయింపు) పన్ను వర్తిస్తోంది. గమనిక: ఈ వార్త/కథనం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈనాడు.నెట్ ప్రోత్సహించడం లేదు. నిపుణుల సలహాపై పెట్టబడులకు సంబంధించి నిర్ణయం తీసుకోండి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.