
Viral video | ఇంటర్నెట్ డెస్క్: కొలంబియాలోని ఓ విమానానికి అనూహ్య పరిస్థితి ఎదురైంది. పర్వత శిఖరాల్లో ఉన్న విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో రెండుసార్లు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పైలట్ అప్రమత్తతతో విమానానికి ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విమానం కొలంబియాలోని బొగోటా నుంచి పాస్టోలోని విమానాశ్రయానికి బయలుదేరింది. ఈ ఎయిర్‌పోర్టు సముద్ర మట్టానికి దాదాపు 6 వేల అడుగుల ఎత్తులో ఉంది. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు వీయడంతో పైలట్ తొలుత విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. రెండోసారి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనలకు గురయ్యారు. భయంతో కొందరు అరవడం, మరికొందరు ఏడవడం, ఇంకొందరు ప్రార్థనలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ల్యాండింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో పైలట్ మరో ప్రయత్నం చేయకుండా విమానాన్ని తిరిగి బొగోటాకు మళ్లించాడు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వాతావరణం కుదుటపడ్డాక విమానం ఎట్టకేలకు పాస్టోలోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగానే ఇలా జరిగిందని పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లో పైలట్ సరైన నిర్ణయం తీసుకున్నారని అభినందించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.