
ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాకు యాంటీ-పైరసీ ఇంజంక్షన్ జారీ చేసింది. సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ సినిమాను (Peddi) ఇంటర్నెట్లో అక్రమంగా అప్లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్లో లీక్ అయితే నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘యాంటీ పైరసీ ఇంజంక్షన్’ (Anti-Piracy Injunction) అనేది కాపీరైట్ హక్కుదారులు తమ కంటెంట్ (సినిమాలు, వెబ్‌సిరీస్‌లు) అక్రమంగా కాపీ కాకుండా, పైరసీ వెబ్సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఒక న్యాయపరమైన రక్షణ ఉత్తర్వు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే, కొత్త యూఆర్ఎల్తో అదే కంటెంట్ రాకుండా కొత్త సైట్లను కూడా ఆటోమెటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ ‘డైనమిక్ ఇంజంక్షన్’ (Dynamic Injunction) ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి. గతకొంత కాలంగా ఇండస్ట్రీని పైరసీ బూతం వెంటాడుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల కూడా విజయ్ ‘జననాయగన్’ విడుదలకు ముందే నెట్టింట ప్రత్యక్షమైంది. ఇలాంటివి జరగకుండా ‘పెద్ది’ టీమ్ ముందడుగు వేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు దీనిపై అంచనాలు పెంచేశాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.