
వ్యక్తిగత రుణం..దరఖాస్తుదారులకు వివిధ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సహాయపడే సౌకర్యం. వ్యక్తిగత రుణాలు తాత్కాలిక నగదు అవసరాలను తీర్చుకోవడానికి ఒక మెరుగైన ప్రత్యామ్నాయం లాంటివి కూడా. అయితే, అటువంటి రుణాలతో ముడిపడి ఉన్న కొన్ని సాధారణ అపోహలు, కొంతమంది వీటిని పొందకుండా నిరోధిస్తుంటాయి. వాస్తవంగా, వ్యక్తిగత రుణాలను వివేకంతో ఉపయోగిస్తే అవి మీ ఆర్థిక అవసరాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు చేయాల్సిందల్లా, వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం. సరైన వాస్తవాలను తెలుసుకోవడానికి, తదనుగుణంగా నిర్ణయం తీసుకోవడానికి ఈ కింది విషయాలను తెలుసుకోవడం అవసరం. రుణాన్ని పొందడానికి సుదీర్ఘ దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని రుణాల గురించి తెలియని కొందరి అభిప్రాయం. అయితే, వ్యక్తిగత రుణాలను ఇప్పుడు చాలా రుణ సంస్థలు డిజిటల్, ఆన్లైన్ పద్ధతిలోనే చాలా వేగంగా మంజూరుజేస్తున్నాయి. రుణాలను పొందడానికి డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా కాగిత రహితంగా డిజిటల్ పద్ధతిలోనే చాలా సులభంగానే ఉంటుంది. కేవలం కొన్ని గంటల్లోనే రుణ మంజూరుకు ఆమోదం లభిస్తుంది. ముఖ్యంగా క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్నవారికి ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ లభిస్తాయి. ఇవి మంజూరవ్వడానికి పట్టే సమయం చాలా తక్కువ అని చెప్పవచ్చు. వ్యక్తిగత రుణం, మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రమేనని ఒక సాధారణ అపోహ ఉంది. అది కొంతమేరకు నిజమే. బ్యాంకులు క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుని మీ క్రెడిట్ యోగ్యతను నిర్ణయిస్తాయి. అధిక స్కోరు..బ్యాంకు నుంచి రుణం పొందడంలో మీకు సహాయపడుతుంది. అయితే, తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల రుణ దరఖాస్తు ఆటోమేటిక్‌గా తిరస్కరణకు గురికాదు. ఆదాయం, ఉపాధి స్థిరత్వం, తక్కువ రుణ మొత్తం మొదలైన ఇతర పరిస్థితులను బట్టి, తక్కువ క్రెడిట్ స్కోరుతో కూడా మీరు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. అయితే, కొంత వ్యక్తిగత రుణం, మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రమేనని ఒక సాధారణ అపోహ ఉంది. అది కొంతమేరకు నిజమే. బ్యాంకులు క్రెడిట్ స్కోరును పరిగణనలోకి తీసుకుని మీ క్రెడిట్ యోగ్యతను నిర్ణయిస్తాయి. అధిక స్కోరు..బ్యాంకు నుంచి రుణం పొందడంలో మీకు సహాయపడుతుంది. అయితే, తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల రుణ దరఖాస్తు ఆటోమేటిక్‌గా తిరస్కరణకు గురికాదు. ఆదాయం, ఉపాధి స్థిరత్వం, తక్కువ రుణ మొత్తం మొదలైన ఇతర పరిస్థితులను బట్టి, తక్కువ క్రెడిట్ స్కోరుతో కూడా మీరు వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. అయితే, కొంత మేరకు వడ్డీ రేటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు..రుణం మంజూరు చేసే ముందు కొనసాగుతున్న మీ ప్రస్తుత రుణాల స్థితిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే, మీకు ఇప్పటికే రుణం ఉంటే కొత్త రుణ దరఖాస్తు ఖచ్చితంగా తిరస్కరిస్తారని కాదు. మీ ప్రస్తుత రుణ EMIలను సకాలంలో చెల్లిస్తున్నంత వరకు, ఎటువంటి సమస్య ఉండదు. మీ రుణాల సంఖ్య ఆధారంగా కాకుండా మీ చెల్లింపు సామర్థ్యం ఆధారంగా రుణ దరఖాస్తును అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. మీ ఆదాయ స్థాయిలు, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని గుర్తించి బ్యాంకు సంతృప్తి చెందితే, మీకు ఇప్పటికే రుణం ఉన్నప్పటికీ, మరో రుణాన్ని అందజేసే అవకాశముంది. అనేక రుణ సంస్థలకు రుణ దరఖాస్తులు చేసుకోవడం వల్ల రుణ ఆమోదం పొందే అవకాశం తగ్గుతుందనేది ఒక అపోహ మాత్రమే. అనేక బ్యాంకుల్లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం వల్ల హార్డ్ ఎంక్వైరీల కారణంగా ఆమోదం పొందే అవకాశాలు తగ్గుతాయి. అయితే, ఆరు నెలల వ్యవధిలో 6-7 కంటే తక్కువ వ్యక్తిగత రుణ దరఖాస్తులు మీ క్రెడిట్ స్కోరుపై స్వల్ప ప్రభావాన్ని మాత్రమే చూపిస్తాయి. బ్యాంకులు రిస్క్‌ను నిర్ధారించడానికి, ఆదాయ స్థిరత్వాన్ని అంచనా వేయడానికి క్రెడిట్ నివేదికలను తనిఖీ చేస్తాయి. రుణాలపై బహుళ విచారణలు ఉన్నప్పటికీ మీకు అధిక క్రెడిట్ స్కోరు ఉంటే, అది ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. అలాగే, బ్యాంకులు ఆదాయం, బాధ్యతలు, రుణగ్రహీత ప్రవర్తన మొదలైన వాటిని అంచనా వేయకుండా విచారణల ఆధారంగా మాత్రమే రుణాలను తిరస్కరించలేవు. రుణ తిరస్కరణలు సాధారణంగా రుణ దరఖాస్తుదారుడి ఇతర పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.