"పఫర్ ఫిష్" (Puffer Fish) అనే ఒక రకం చేప ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందనిపించినా లేదా భయం వేసినా, అది వెంటనే తన శరీరాన్ని గాలితో నింపి, ముళ్ళ బంతిలా మార్చుకుంటుంది. దీంతో శత్రువులు తన దగ్గరకు రాకుండా చూసుకుంటుంది. డేటింగ్లో కూడా కొందరు వ్యక్తులు బంధం చాలా సీరియస్ అవుతుంటే, ఎక్కడ తమ మనసు గాయపడుతుందో అనే భయంతో (Defense Mechanism), ఆ చేపలాగే ముళ్ళు విప్పి అవతలి వ్యక్తిని దూరం పెడతారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. రిలేషన్షిప్ నిపుణులు ప్రకారం ఈ పఫర్-ఫిష్ లాంటి వ్యక్తులు మొదట్లో చాలా అద్భుతంగా ఉంటారు. చిన్నతనంలో పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న పరిస్థితులే దీనికి ప్రధాన కారణం అని నిపుణులు చెబుతున్నారు. పఫర్-ఫిషింగ్ లక్షణాలు ఉన్నంత మాత్రాన వారు చెడ్డవారు కాదు. వారు కేవలం బంధం పట్ల ఉన్న భయంతో (Vulnerability) అలా ప్రవర్తిస్తారు. వీరు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది.