
ఇంటర్నెట్ డెస్క్: రామ్‌చరణ్ ‘పెద్ది’ జూన్ 4న (Peddi Release Date) పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే భోపాల్, బెంగళూరులో ప్రమోషన్స్ చేసిన చిత్ర బృందం.. గురువారం దిల్లీలో సందడి చేసింది. అక్కడ నిర్వహించిన ప్రెస్మీట్లో రామ్‌చరణ్ (Ram Charan), జాన్వీకపూర్ (Janhvi Kapoor), దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ తదితరులు పాల్గొన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో గతంలో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ‘‘దిల్లీలో ప్రధాని మోదీని ఇంతకుముందు కలిసినప్పుడు.. ‘పెద్ది’ సినిమా దేని గురించి అని అడిగారు. ఓ విధంగా వికసిత్ భారత్ గురించి చెప్పే కథ అని వివరించా. అప్పుడు ఆయన నాతో ఓ స్ఫూర్తినింపే స్టోరీని పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో మహ్మద్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఉండేవాడు. కొన్నేళ్ల క్రితమే భారత్ తరఫున ఆడాడు. తన ఊరికి గుర్తింపు తీసుకొచ్చాడు. ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మంది ప్లేయర్స్ ఉన్నారు’ అని చెప్పారు. ఒక వ్యక్తి ఎంతో మార్పు తీసుకురాగలడు అన్న దానికి ఇదొక నిదర్శనం. పెద్ది పాత్ర కూడా అలాంటిదే’’ అని చరణ్ వివరించారు. సినిమాలో ఇంత బాగా డ్యాన్స్ ఎలా చేశారు? అని అడగ్గా.. నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారంటూ చరణ్ నవ్వులు పూయించారు. జాన్వీ మాట్లాడుతూ.. ‘‘తెరపై కనిపించే రామ్‌చరణ్‌కు, తెరవెనుక చరణ్‌కు అస్సలు పోలిక ఉండదు. బయట చాలా కూల్‌గా ఉంటారు. బొమన్ ఇరానీతో కలిసి నటించాలన్న డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది. నా పాత్ర విషయంలో దర్శకుడు బుచ్చిబాబు చెప్పిందే నేను ఫాలో అయ్యా. మేమంతా ఆయన ఫ్యాన్స్’’ అని పేర్కొన్నారు. ‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ మాత్రమే ‘పెద్ది’ కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ మాత్రమే కాదు.. ఇందులో ట్రయాంటిల్ లవ్‌స్టోరీ ఉందంటూ దివ్యేందు శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్‌చరణ్, జాన్వీలది ఓ ప్రేమకథ అయితే.. తనకు, చరణ్‌కు మధ్య మరో లవ్‌స్టోరీ ఉందని, అది చాలా టాక్సిక్ అంటూ వ్యాఖ్యానించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.