
Twisha Sharma Case:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ట్విషా శర్మ అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేసిన కొద్ది గంటల్లోనే ఈ చర్యలు తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.భోపాల్‌లోని గిరిబాలా సింగ్ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం గిరిబాలా సింగ్‌ను కస్టడీలోకి తీసుకున్న సీబీఐ ఆమెను మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే డిజిటల్ ఆధారాలు, వాట్సాప్ చాట్స్, సీసీటీవీ వీడియోలు కూడా కీలకంగా మారాయి. ఈ కేసులో ఇంకా మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్విషా కుటుంబ సభ్యుల ఆరోపణలు ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. వివాహం తర్వాత ట్విషాను తరచూ వేధించేవారని, అదనపు కట్నం కోరేవారని వారు ఆరోపిస్తున్నారు. ట్విషా గర్భవతి అయిన తర్వాత కుటుంబంలో గొడవలు పెరిగాయని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అబార్షన్ చేయాలని ఒత్తిడి తెచ్చారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ జడ్జి అరెస్టు కావడం, సీబీఐ దర్యాప్తు చేపట్టడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. గిరిబాలా సింగ్‌కు ముందుగా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ట్విషా శరీరంపై ఏడు గాయాలున్నాయని, వాటిని కోర్టులో సీబీఐ ప్రస్తావించింది. అలాగే వాట్సాప్ చాట్స్ ద్వారా ట్విషాపై మానసిక వేధింపులు జరిగినట్లు ఆధారాలు గిరిబాలా సింగ్‌కు ముందుగా సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే దీనిపై సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ట్విషా శరీరంపై ఏడు గాయాలున్నాయని, వాటిని కోర్టులో సీబీఐ ప్రస్తావించింది. అలాగే వాట్సాప్ చాట్స్ ద్వారా ట్విషాపై మానసిక వేధింపులు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపింది. దర్యాప్తుకు గిరిబాలా సింగ్ సహకరించలేదని కూడా సీబీఐ కోర్టుకు వివరించింది. ఈ అంశాలను సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు ఆమెకు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేసింది. మొదట ఈ కేసును మధ్యప్రదేశ్ పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ కేసు తీవ్రత పెరగడంతో పాటు పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును చేపట్టింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సీబీఐ మళ్లీ రిజిస్టర్ చేసింది. ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్ ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్నాడు. ట్విషా శర్మ నోయిడాకు చెందిన యువతి. గత ఏడాది డిసెంబర్ 19న సమర్థ్ సింగ్ అనే న్యాయవాదిని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత భోపాల్‌లో తన భర్త కుటుంబంతో కలిసి నివసిస్తోంది. మే 12న ట్విషా తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఇది సాధారణ ఆత్మహత్య కాదని, దీని వెనుక మానసిక వేధింపులు, కట్నం కోసం హింస ఉందని ఆరోపించారు.