
చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తగ్గేదేలే అంటున్నాడు. ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో SRHపై 29 బంతుల్లో 97 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లా తాజ్‌పూర్‌లో 2011 మార్చి 27న వైభవ్ జన్మించాడు. తండ్రి తన ఆస్తులు విక్రయించి వైభవ్‌కు క్రికెట్లో శిక్షణ ఇప్పించారు. 13 ఏళ్ల వయసులో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టి.. 14వ ఏటా ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. అతి పిన్నవయస్కుడైన ఐపీఎల్ క్రికెటర్ ఇప్పటికీ వైభవే. వైభవ్ సూర్యవంశీ ప్రతిభకు రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిదా అయిపోయింది. 2025 ఐపీఎల్ వేలంలో రూ.1.1 కోట్లు పెట్టింది దక్కించుకుంది. 2025 సీజన్లో గుజరాత్‌పై 38 బంతుల్లో సెంచరీ బాది ఔరా అనిపించాడు. ఇప్పుడు 65 సిక్స్‌లు బాది క్రిస్ గేల్ (59) రికార్డూ బద్దలుకొట్టాడు. రాష్ట్రీయ బాల్ పురస్కారం- 2025 అందుకున్న వైభవ్.. ‘‘ఓర్పు, అంకితభావంతో చేసే ప్రతి ప్రయత్నం.. మీరు మెరెసేందుకు సిద్ధం చేస్తుంది’’ అని అన్నాడు. వెస్టిండీస్ బ్యాటర్ బ్రియాన్ లారా, భారత ఆటగాడు యువరాజ్ సింగ్‌కు వైభవ్ పెద్ద ఫ్యాన్. వాళ్లలా దూకుడుగా ఆడటాన్ని ఇష్టపడతానని చెప్పాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వైభవ్ కార్టూన్స్ చూస్తాడు. అలా చేస్తేనే తనలో ఒత్తిడి పోతుందని, మైదానంలో స్వేచ్ఛగా ఆడగలనని అన్నాడు. పిజ్జా, బర్గర్ వంటి జంక్‌ఫుడ్‌ను ఇష్టం. కానీ, క్రికెట్లో ఫిట్నెస్ ముఖ్యమని.. వాటన్నింటినీ త్యాగం చేశాడు. ‘ధురంధర్’ ఫేవరెట్ చిత్రమని చెప్పాడు. టీ20ల్లో గేల్ అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు (175)పై వైభవ్ కన్నేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయడమే లక్ష్యమంటున్నాడు. వైభవ్ ఆటను మెచ్చిన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ.. అతడికి ఐపీఎల్ కప్ నమూనా, తను ఆటోగ్రాఫ్ పెట్టిన క్యాప్‌ను గిఫ్ట్‌గా పంపించాడు. వైభవ్ సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ తల్ల్లిదండ్రులు సంజీవ్, ఆర్తి. అతడికి ముగ్గురు సోదరులున్నారు. ఈ ఏడాదే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఈ కుర్రాడికి ఇన్‌స్టా ఖాతాను 54లక్షల మంది ఫాలో అవుతున్నారు. మ్యాచ్‌తోపాటు కుటుంబానికి సంబంధించిన ఫొటోలూ పోస్టు చేస్తుంటాడు. IPL: ఈ ఏడాది ఎక్కువ మొక్కలు నాటించింది వీరే! ఐపీఎల్ 2026: వీళ్ల స్పెషల్ సెలబ్రేషన్స్ చూశారా? ఐపీఎల్ 2026 షెడ్యూల్.. ఫ్రాంచైజీల వారీగా... ఐపీఎల్ 2026: గాయాలతో వీరు.. కారణాలతో వారు ఔట్