
Voda Idea on Airtel | దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ లాంచ్ చేసిన ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్’ ప్లాన్‌పై మరో టెల్కో వొడాఫోన్ ఐడియా (VI) పరోక్షంగా విమర్శలు గుప్పించింది. తమ నెట్‌వర్క్‌లో అందరికీ సమ ప్రాధాన్యం ఉంటుందని, తమ నెట్‌వర్క్‌కు మారాలని యూజర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోంది. తమ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ద్వారా రద్దీ సమయంలోనూ నెట్వర్క్ అంతరాయాలు ఉండవంటూ ఎయిర్టెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇది నెట్‌న్యూట్రాలిటీకి విరుద్ధమంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా ఎయిర్‌టెల్‌ను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచారానికి తెరతీసింది. ‘మాకు ఎవరూ ఎక్కువా కాదు.. ఎవరూ తక్కువా కాదు’.. ‘మా నెట్‌వర్క్‌లో అందరికీ సమ ప్రాధాన్యం’.. ‘స్ట్రాంగ్ నెట్వర్క్ అందరి హక్కు.. ఇప్పుడే వీఐకి మారండి’ అంటూ వీఐ ప్రచారం చేసుకుంటోంది. రోజు రోజుకూ తమ నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నామని, 110కి పైగా నగరాల్లో 5జీ సేవలు అందుతున్నాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ నెట్వర్క్ టెక్నాలజీ సాయంతో మెరుగైన కనెక్టివిటీని అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడిప్పుడే వొడాఫోన్ ఐడియా దేశంలో 5జీ సేవలను విస్తరిస్తుండగా.. ఎయిర్టెల్ ఇప్పటికే తన 5జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించింది. మరోవైపు నెట్న్యూట్రాలిటీ విమర్శలపైనా ఎయిర్టెల్ స్పందించింది. నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ సాయంతో పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, ఇది న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని తెలిపింది. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ వల్ల మిగిలిన యూజర్లకు సేవల్లో నాణ్యత తగ్గదని స్పష్టంచేసింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్‌కు సమాధానం ఇచ్చింది. మరో టెలికాం కంపెనీ జియో కూడా ఎయిర్టెల్ వాదనను సమర్థించింది. నెట్‌న్యూట్రాలిటీకి సూత్రాలకు 5జీ నెట్వర్క్ మరోవైపు నెట్న్యూట్రాలిటీ విమర్శలపైనా ఎయిర్టెల్ స్పందించింది. నెట్వర్క్ స్లైసింగ్ టెక్నాలజీ సాయంతో పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మెరుగైన సేవలను అందిస్తున్నామని, ఇది న్యూట్రాలిటీకి వ్యతిరేకం కాదని తెలిపింది. ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ వల్ల మిగిలిన యూజర్లకు సేవల్లో నాణ్యత తగ్గదని స్పష్టంచేసింది. ఈ మేరకు పార్లమెంటరీ ప్యానెల్‌కు సమాధానం ఇచ్చింది. మరో టెలికాం కంపెనీ జియో కూడా ఎయిర్టెల్ వాదనను సమర్థించింది. నెట్‌న్యూట్రాలిటీకి సూత్రాలకు 5జీ నెట్వర్క్ స్లైసింగ్ విరుద్ధం కాదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.