
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. PM Modi On Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'పెద్ది'. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను చిత్రబృందం జోరుగా కొనసాగిస్తుంది. నిన్న మొన్న ముంబై, భోపాల్, బెంగళూరు పూర్తి చేసుకోని నేడు ఢిల్లీకి చేరుకుంది చిత్రబృందం. ఢిల్లీలో నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు కీలక నటులు బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రెస్మీట్లో హీరో రామ్ చరణ్ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కొంత ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ రోడ్డు, ఎర్రకోట దగ్గర షూటింగ్ చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీతో రామ్‌చరణ్ ఫ్యామిలీ కలిశారు. "నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. 'పెద్ది' సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. దానికి నేను సమాధానమిస్తూ.. ఓ రకంగా ఇది మన దేశ ప్రగతిని, 'వికసిత్ ఈ ప్రెస్మీట్లో హీరో రామ్ చరణ్ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన భేటీని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను కొంత ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ రోడ్డు, ఎర్రకోట దగ్గర షూటింగ్ చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాని మోదీతో రామ్‌చరణ్ ఫ్యామిలీ కలిశారు. "నేను గతంలో ప్రధాని మోదీని కలిసినప్పుడు.. 'పెద్ది' సినిమా దేని గురించి అని ఆయన అడిగారు. దానికి నేను సమాధానమిస్తూ.. ఓ రకంగా ఇది మన దేశ ప్రగతిని, 'వికసిత్ భారత్'ను ప్రతిబింబించే కథ అని వివరించాను" అని రామ్ చరణ్ తెలిపారు. మోదీ పంచుకున్న నిజ జీవిత కథ.. అప్పుడు ప్రధాని మోదీ తనకు ఒక స్ఫూర్తినింపే నిజ జీవిత సంఘటనను చెప్పారని చరణ్ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక గ్రామానికి చెందిన 'మహ్మద్' అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు దేశం తరఫున ఆడి, తన ఊరికి ఎలా గుర్తింపు తెచ్చాడో ప్రధాని వివరించారు. ఆ ఒక్కడి వల్లే నేడు ఆ గ్రామం నుండి 85 మందికి పైగా క్రీడాకారులు తయారయ్యారని మోదీ చెప్పారు. ఒకే ఒక్క వ్యక్తి సమాజంలో ఎంతటి మార్పు తీసుకురాగలడు అనేదానికి ఆ కథ నిదర్శనమని, 'పెద్ది' సినిమాలో తన పాత్ర కూడా సరిగ్గా అలాంటి స్ఫూర్తితోనే సాగుతుందని చరణ్ వెల్లడించారు. ఇక సినిమాలో తన డ్యాన్స్ గురించి అడగ్గా.. "నిర్మాత మంచి పారితోషికం ఇచ్చారు (నవ్వుతూ)" అంటూ చరణ్ చమత్కరించారు. అదే విధంగా చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ మాట్లాడుతూ రామ్ చరణ్ వ్యక్తిత్వాన్ని, దర్శకుడి ప్రతిభను కొనియాడారు. "తెరపై కనిపించే రామ్ చరణ్‌కు, నిజ జీవితంలో ఉండే చరణ్‌కు అస్సలు పోలిక ఉండదు. బయట ఆయన చాలా సింపుల్‌గా, కూల్‌గా ఉంటారు" అని జాన్వీ కపూర్ చెప్పారు. అలాగే సీనియర్ నటుడు బొమన్ ఇరానీతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో నటించాలనే తన కల ఈ సినిమాతో నెరవేరిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. దర్శకుడు బుచ్చిబాబు సానా విజన్‌ను తాను పూర్తిగా నమ్మానని, ఆయన స్క్రిప్ట్‌ను అద్భుతంగా తెరకెక్కించారని, సెట్స్‌లో చిత్ర యూనిట్ అంతా ఆయనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయామని జాన్వీ పేర్కొన్నారు. Also Read: 24 ఏళ్లకే పెళ్లి కాకుండా తల్లైనా స్టార్ హీరోయిన్..మధ్యలో అతను వదిలేసి పోయాడని ఆవేదన! Also REad: తెలంగాణలో 'పెద్ది' రిలీజ్‌కు లైన్ క్లియర్..ఒకే మాటపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook