
అన్నదాతకు అండగా ప్రవేశపెట్టింది: ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే బలపరిచింది: మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు బి.జయనాగేశ్వరరెడ్డి, బెందాళం అశోక్, ఎం.ఉగ్రనరసింహారెడ్డి రాయలసీమలో కరవు నివారణ ప్రాజెక్టులు చేపట్టి పూర్తిచేస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వాలదే. చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపట్టి, 12 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. రాయలసీమలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాగులో సాంకేతికత, యాంత్రీకరణ సూక్ష్మ, బిందుసేద్యం, కిసాన్ డ్రోన్, ఈ-పంట, అన్నదాతా సుఖీభవ వంటి విధానాలు, పథకాలు ప్రవేశపెట్టింది చంద్రబాబే. ఎన్టీఆర్ హయాంలోనే పటేల్, పట్వారీ వ్యవస్థలు రద్దయ్యాయి. చంద్రబాబు పాలనలో నీటి వినియోగదారుల సంఘాలు, రైతుబజార్లు, కొత్తగా మార్కెట్ యార్డులు ఏర్పాటయ్యాయి. యువగళంలో లోకేశ్ హామీ మేరకు సీమను ఉద్యానహబ్‌గా మారుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కోల్ట్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు వస్తున్నాయి. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నాయకుడు, కార్యకర్తలు రప్పారప్పా అంటూ రక్తం పారిస్తామని ప్రకటిస్తున్నారు. మనం కడతామంటే.. వారు పడగొడతామంటున్నారు. ఆ పార్టీ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉండేది. అత్యధిక రుణభారం ఉన్న రైతులు ఏపీలోనే ఎక్కువ. ఉన్మాదంతో ఉన్న గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కట్టాలి. మౌలిక వసతుల రంగంలో పురోగతి ప్రవేశపెట్టింది: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే బలపరిచింది: మంతెన రామరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్ తెదేపా అంటే అభివృద్ధికి ప్రతీక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం 25,194 కి.మీ. మేర రోడ్లు వేసింది. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం 1,800 కి.మీ. మాత్రమే నిర్మించింది. గత ప్రభుత్వం రోడ్లు-భవనాలు, జలవనరులు, వ్యవసాయ శాఖలకు మూత వేసింది. తెదేపా అంటే అభివృద్ధికి ప్రతీక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం 25,194 కి.మీ. మేర రోడ్లు వేసింది. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం 1,800 కి.మీ. మాత్రమే నిర్మించింది. గత ప్రభుత్వం రోడ్లు-భవనాలు, జలవనరులు, వ్యవసాయ శాఖలకు మూత వేసింది. బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో 40 శాతం కూడా ఖర్చు చేయలేదు. రాష్ట్రంలో 45,375 కి.మీ. పొడవైన రహదారులుంటే.. అందులో 50 శాతం జగన్ హయాంలో దెబ్బతిన్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురై చాలామంది మృత్యువాత పడ్డారు. కేంద్ర భాగస్వామ్యంతో భారతమాల కింద చేపట్టిన ప్రాజెక్టులకు వైకాపా సర్కారు రాష్ట్ర వాటా ఇవ్వకుండా అవి ఆగిపోయే పరిస్థితి తెచ్చింది. కూటమి ప్రభుత్వం రూ.81,879 కోట్లతో.. 1,749 కి.మీ. ఎనిమిది జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆమోదించింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను చాలా ఇబ్బంది పెట్టిన జగన్ ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు. రాజధానిపై జగన్ మళ్లీ కుట్రలకు పాల్పడే అవకాశం లేకుండా కేంద్రం చట్టం తెచ్చింది. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతీయ ఆర్థిక మండళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రెండేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పేదలకు పక్కా ఇళ్లు అనేది ఎన్టీఆర్ సృష్టి. గత ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో పేదలకు సెంటు స్థలం మాత్రమే ఇచ్చింది. జగన్ కుటుంబంలో నలుగురు ఉంటే.. వారికి వివిధ ప్రాంతాల్లో 40 ఎకరాల్లో (4,000 సెంట్లు) ప్యాలెస్‌లు ఉన్నాయి. అదే విస్తీర్ణంలో పేదలు 4,000 మంది ఉండాలని జగన్ ప్రభుత్వం చెప్పింది. సంపద సృష్టి ప్రవేశపెట్టింది: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే యువతరం ఆకాంక్షలు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాల దశ, దిశలను యువతరం నిర్దేశించనుంది. హత్యా రాజకీయాలు చేసే నాయకులు, అవినీతిపరులు తమకొద్దని, విజనరీ లీడర్ కావాలని యువత కోరుకుంటోంది. వారి ఆకాంక్షలకు దగ్గరగా సాగుదాం. జగన్ ముఖ్యమంత్రిగా సాగించిన ప్రజాకంటక పాలనను వ్యతిరేకించి ఆ పార్టీ నుంచి గత ఎన్నికలకు 16 నెలల ముందే బయటకొచ్చి, ఉద్యమించా. ప్రజావేదిక నుంచి కీలకమైన అమరావతి రాజధాని వరకు జగన్ పాలనలో అన్నీ విధ్వంసాలే. నాటి ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడినందుకు నాపై, నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధించారు. సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలన్న లోకేశ్ నిర్ణయం చరిత్రాత్మకం. మనల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించిన కార్యకర్తల రుణం తీర్చుకునే సమయం వచ్చింది. గత ప్రభుత్వంలో కేసులకు వెరవకుండా పోరాడిన కార్యకర్తలను అధిష్ఠానం గుర్తించి, వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తే.. వారిని భుజాలపై పెట్టుకుని గెలిపించే బాధ్యత తీసుకుంటాం. రెండేళ్లలో రూ.20 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు వచ్చాయి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సాయం ప్రవేశపెట్టింది: పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్రమంత్రి రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరగాలంటే దూరదృష్టి, సంకల్పం, కేంద్ర సహకారం తప్పనిసరని సీఎం చంద్రబాబు నమ్మారు. భవిష్యత్ తరాల కోసం వ్యూహాత్మక నిర్ణయమే ఎన్డీయే కూటమి ఏర్పాటు. వైకాపా పాలనతో విచ్ఛిన్నమైన