
ఈనాడు, అమరావతి: రాంచరణ్ నటించిన పెద్ది సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు, జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీతో కలిపి), అలాగే సినిమా విడుదలయ్యే 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌విశ్వజిత్ ఉత్తర్వులిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.