
కోల్‌కతా: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీలో లుకలుకలు ఒకటొకటి బయటపడుతున్నాయి. ఆ పార్టీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. రాజ్యసభ మాజీ ఎంపీ శంతను సేన్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి పంపానన్నారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచార ఉదంతంపై తమ పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. అనైతిక చర్యల కారణంగానే ఎన్నికల్లో ప్రజలు పార్టీని తిరస్కరించారని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను టీఎంసీ ఆవిర్భావం నుంచి విధేయత కలిగిన సైనికుడిగా ఉన్నానంటూ..పార్టీ వివాదాలను బహిరంగంగా సమర్థించడం తనకు నైతికంగా ఇబ్బందికరంగా మారిందని వ్యాఖ్యానించారు. కాగా, ఆర్జీకర్ ఉదంతంపై నిరసన గళం వినిపించిన అతికొద్ది మంది టీఎంసీ నేతల్లో శంతను సేన్ ఒకరు. దీనిపై అప్పట్లో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తిరిగి పార్టీలో చేర్చుకుంది. బుధవారం సీనియర్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్, పార్టీ అధికార ప్రతినిధి, టీఎంసీ కౌన్సిలర్లు అనూప్ చక్రవర్తి, సుశాంత ఘోష్ పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. సాయిపల్లవి ఫ్యామిలీ టైమ్.. అందరితో ఎంజాయ్ చేస్తూ (ఫొటోలు) తిరుపతి: వైభవంగా నారాయణవనం బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు) రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు) తిరుపతి: స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు (ఫోటోలు) దుర్గేష్ ను కావాలని టార్గెట్ చేసిన పవన్.. అసలు కథ ఇదే..! బాబు నోటా జగన్ నామస్మరణ.. జగన్ మీటింగ్ తో కొట్టుకుపోయిన " May 29 2026 7:12 AM | Updated on May 29 2026 7:12 AM బాబు నోటా జగన్ నామస్మరణ.. జగన్ మీటింగ్ తో కొట్టుకుపోయిన " మహానాడు " ఆయన శాఖను గాలికి వదిలేశాడు.. లోకేష్ పై పేర్ని నాని పంచులు నా ఫ్యామిలీ జోలికి రావద్దు..! వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్