మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Forbes 30 Under 30 Asia 2026: అంతర్జాతీయ వేదికలపై తెలుగు యువత తమ సత్తా చాటుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామిక వేత్తలు చోటు దక్కించుకున్నారు. సమాజంలో సరికొత్త మార్పులు తీసుకురావాలన్న వారి వినూత్న ఆలోచనలతో నేడు గ్లోబల్ జాబితాలో వారిని నిలబెట్టాయి. ఆర్థిక రంగానికి సరికొత్త స్టార్టప్ ను తీసుకువచ్చిన శివగణేష్ ఒకరు అయితే.. సామాజిక సేవా రంగంలో గ్రామీణ విద్యార్థుల కోసం అద్భుతాలు స్రుష్టిస్తున్న మధులాష్ బాబు క్రొవ్విడి మరొకరు. ఈ ఇద్దరు కూడా తమ సరికొత్త ఐడియాలతో నేటితరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పాలి. శివగణేష్ గడ్డం: చిన్నతనం నుంచే పిల్లలకు పొదుపు, డబ్బు విలువ నేర్పించాలన్న ఒక గొప్ప ఆశయంతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నేటి డిజిటల్ యుగంలో డబ్బును ఎలా పొదుపుగా వాడుకోవాలన్నది ముఖ్యం. అందుకే చిన్నారులకు, యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా కామిక్స్ రూపంలో బడ్జెట్, పెట్టుబడులు, పొదుపు, ఇన్సూరెన్స్, వ్యాపారవేత్తలుగా ఎలా మారాలి అనే కఠినమైన ఆర్థిక ఆంశాలను నేర్పించేందుకు జెని5 అనే అంకుర సంస్థను స్థాపించారు. తెలంగాణకు చెందిన ఈ యువ పారిశ్రామిక వేత్త శివగణేశ్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అంతర్జాతీయంగా గుర్తింపు పొంది ఫోర్బ్స్ జాబితాలోని ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ విభాగంలో చోటు దక్కించుకున్నారు. ALSO READ: రైల్వే సిబ్బంది..ప్రమోషన్లు, పాస్‌పోర్ట్ ALSO READ: రైల్వే సిబ్బంది..ప్రమోషన్లు, పాస్‌పోర్ట్ NOCల కోసం కేంద్రం తెచ్చిన కొత్త సిస్టమ్ ఇదే ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు క్రొవ్విడి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆశాదీపంగా మారారు. హైదరాబాద్‌లో ఎడోద్వాజ ఫౌండేషన్‌ను స్థాపించారు. మధులాష్ వినూత్న ప్రాజెక్ట్ – ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ (ఫ్లో బస్) గ్రామీణ ప్రాంతాల్లోని 60,000 మంది విద్యార్థులకు యాక్సెస్ టెక్నాలజీని అందించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అద్బుతమైన సాంకేతిక పరిజ్నాన్ని అందిస్తోంది. ఈ సామాజిక విప్లవమే మధులాష్ బాబును ఫోర్బ్స్ 30లో సేవా విభాగంలో నిలబెట్టింది. తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన ఈ ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలపై ప్రస్తుతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ALSO READ: పాకిస్తాన్‌ను ఆదుకుంటున్న గాడిదలు.. దేశ GDPకి బూస్టర్ స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి