
ఇంటర్నెట్‌డెస్క్: అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ (Blue Origin)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ పరీక్షించిన ఓ రాకెట్ లాంచ్‌ప్యాడ్ పైనే పేలిపోయింది. దీంతో అగ్నిగోళంలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్లో గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) బ్లూ ఆరిజిన్ సంస్థ ‘న్యూ గ్లెన్’ రాకెట్‌కు సంబంధించి హాట్‌ఫైర్ పరీక్ష నిర్వహించింది. ఆ సమయంలో ఉన్నట్టుండి రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సంస్థ వెల్లడించింది. అయితే, ప్రయోగ కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. పేలుడుకు సంబంధించి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంపై జెఫ్ బెజోస్ (Jeff Bezos) స్పందించారు. ఇది తమకు కష్టమైన రోజు అని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.