మరో వైపు లక్కీ తన అమ్మ కోసం, అమ్మ ఎక్కడుంది చెప్పు అని ఆంటోనీ గాడ్ని అడుగుతూ ఉంటాడు. వాడేమో పీకలదాక తాగి, తిని కాకమ్మ కబుర్లు చెబుతుంటాడు. అలా లక్కీ బాధపడుతున్న టైంలోనే రాజు ఫోన్ చేస్తాడు. బైక్ తీసుకుని రా రా అని చెబుతాడు. బైక్ మీద కాకపోతే కారులో వస్తానా? అని లక్కీ కౌంటర్ వేస్తాడు. త్వరగా రా రా అని లక్కీని పిలుస్తాడు రాజు. చూస్తుంటే ఆ బైకుని అమ్మి.. తాకట్టు పెట్టిన చైన్ విడిపించాలని రాజు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇంకో వైపు ఐశ్వర్యకి అప్పు ఇచ్చిన రాకేష్ ఫోన్ చేస్తాడు. ఇంకెన్ని రోజులు పడుతుంది.. మాటి ఇచ్చిన ఇందు కూడా సైలెంట్‌గానే ఉంది.. ఆమెకు ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అని అంటాడు. ఇక ఇందు మాట్లాడి కన్విన్స్ చేసి ఇంకో రెండు రోజులు గడువు అడుగుతుంది. నీ వల్లే ఇదంతా అని ఇందుని తిరిగి తిడుతుంది ఐశ్వర్య. పిచ్చి పనులు నువ్వు చేసి నన్ను అంటున్నావా? అని ఐశ్వర్యని తిడుతుంది ఇందు. మన పరిస్థితి తెలీకుండా అప్పులు చేశావ్.. జల్సాలకు వాడుకున్నావ్ అని తిడుతుంది ఇందు. నా రూం లాక్కుని నాకు నీతులు చెబుతున్నావా అని కసురుకుని వెళ్తుంది ఐశ్వర్య. నువ్వు ఇంత మంచివాడిలా ఎప్పుడు మారిపోయావ్ రా.. ఇవన్నీ మనకు అలవాటే కదరా అని లక్కీ అంటాడు. అది వాళ్ల అమ్మ గుర్తురా.. తెలీక తాకట్టు పెట్టా.. అని ఫీల్ అవుతున్నా అని లక్కీతో చెప్పుకుని రాజు బాధపడతాడు. ఇది మనకు సెట్ కాదు రా అని లక్కీ అంటాడు. డబ్బు కోసం మనం ఏ పనైనా చేస్తాం కద రా.. నువ్వే ఏ రిస్క్ అయినా నువ్వు ఇంత మంచివాడిలా ఎప్పుడు మారిపోయావ్ రా.. ఇవన్నీ మనకు అలవాటే కదరా అని లక్కీ అంటాడు. అది వాళ్ల అమ్మ గుర్తురా.. తెలీక తాకట్టు పెట్టా.. అని ఫీల్ అవుతున్నా అని లక్కీతో చెప్పుకుని రాజు బాధపడతాడు. ఇది మనకు సెట్ కాదు రా అని లక్కీ అంటాడు. డబ్బు కోసం మనం ఏ పనైనా చేస్తాం కద రా.. నువ్వే ఏ రిస్క్ అయినా చేస్తుంటావ్ కదా రా అని లక్కీ అంటాడు. పూర్తిగా మారిపోయావ్ రా.. కిడ్నాప్ చేస్తే భార్య, ఇల్లు, ఆస్తి, మార్పు అన్నీ వచ్చాయి రా అని లక్కీ అంటాడు. లోఫర్ గాడికి మంచి భార్య వస్తుందంటే నమ్మలేదు రా అని లక్కీ అంటే.. ఎవడ్రా ఆ లోఫర్ గాడు అని రాజు అడుగుతాడు. ఇంకెవరు నువ్వేరా అని కామెడీ చేస్తాడు లక్కీ. అసలు కిడ్నాప్ చేసిన మనిషిని బైక్ ఎక్కించుకుని తిప్పుతాడా.. ఇంటికి తీసుకు వెళ్లి పరిచయం చేస్తాడా? నువ్వు మారిపోయావ్ రా అని లక్కీ అంటాడు. నేను మారలేదు.. డబ్బు మనిషినే అని రాజు అంటాడు. ఆ నెక్లెస్ అమ్మది అని తెలిసిన తరువాత నేను నేనుగా ఉండలేకపోతోన్నా.. ఆ నెక్లెస్ విడిపించి ఇస్తా.. ఈ బైక్ తాకట్టు పెట్టేస్తా.. అని రాజు అంటాడు. ఇది నీకు సెంటిమెంట్ కదరా అని లక్కీ అంటే.. ఆ చైన్ వాళ్ల అమ్మ సెంటిమెంట్ కదరా అని అంటాడు రాజు. నన్ను త్వరగా ఇంటికి పిలువురా అంటే.. పిలుస్తాను రా అని వెళ్లిపోతాడు రాజు. ఐశ్వర్య చేసిన పనుల వల్ల మనశ్శాంతిగా ఉండలేకపోతోన్నా అని రాజుతో ఇందు అంటుంది. ఆమెను మార్చడం నీ వల్ల కాదు అని రాజు అంటాడు. నీకు దాని మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టే.. అదే నిన్ను కిడ్నాప్ చేయించందని చెప్పడం లేదు అని రాజు లోలోపల అనుకుంటాడు. నీకొక సర్ ప్రైజ్ అని రాజు తీసుకు వచ్చిన ఆ చైన్‌ను చూపిస్తాడు. దీంతో ఇందు తెగ సంబరపడిపోతుంది. దీన్ని తాకట్టు పెట్టావ్ కదా.. ఎలా తెచ్చావ్.. అని ఇందు అడుగుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి.. అని ఇందు ప్రశ్నిస్తుంది. ఇది మీ అమ్మ సెంటిమెంట్ కదా.. అని రాజు అంటాడు. ఇది నీ వెంట ఉంటే.. మీ అమ్మ నీతో ఉన్నట్టుగా ఫీల్ అవుతావ్.. అందుకే నీకు దూరం చేయాలని అనుకోలేదు.. ఇందాక టెన్షన్లో ఉండి ఆలోచించకుండా తీసుకు వెళ్లా సారీ అని రాజు అంటాడు. అబ్బో నువ్వు కూడా మనసు పెట్టి ఆలోచిస్తావా? అని ఇందు అంటుంది. నీలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తోంది అని ఇందు అంటుంది. నేను డబ్బు మనిషినే.. కాకపోతే మీ అమ్మ గుర్తుని దూరం చేయాలని అనుకోలేదు అని రాజు అంటాడు. ఈ సారి టైంకి డబ్బులు ఇవ్వు అని రాజు అంటాడు. మంచోడు.. మనసు ఉన్నోడే అని ఇందు సంబరపడిపోతుంది. వెంకీకి జాబ్ వస్తుందో లేదో అని లక్ష్మీ, చలపతి కంగారు పడుతుంటారు. ఇంతలో వెంకీ వచ్చి ఉద్యోగం రాలేదని చెబుతారు. అదే