
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో ముంబయి ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబయి నుంచి అభిమానులు ఇలాంటి ఆటతీరును ఆశించలేదు. స్టార్ ప్లేయర్లున్నా విజయాలు దక్కలేదు. అయితే, కెప్టెన్ హార్దిక్ పాండ్య తీరు వల్లేనని ఫ్యాన్స్ కూడా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వచ్చే సీజన్లో ముంబయి ఇండియన్స్ సారథ్యం నుంచి హార్దిక్ వైదొలుగుతాడని.. అందుకు ఇటీవల పెట్టిన పోస్టులే సాక్ష్యమని నెట్టింట చర్చ సాగుతోంది. తాజాగా మరొక అంశం కూడా బయటకు వచ్చింది. రోహిత్ శర్మ చెప్పిన ప్లేయర్‌కే ముంబయి సారథ్యం దక్కే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘రోహిత్ శర్మ సారథ్యంలో ముంబయి ఐదు టైటిళ్లను సొంతం చేసుకుంది. కానీ, రెండేళ్ల కిందట రోహిత్‌కు బదులు హార్దిక్ పాండ్యను సారథిగా నియమించింది. ఆ జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే సీజన్‌కు కొత్త సారథిని నియమించే అవకాశాలు ఎక్కువే. గతంలో చేసిన పొరపాట్లను ముంబయి సరిచేసుకొనేలా నిర్ణయం తీసుకోనుంది. రోహిత్ మళ్లీ సారథిగా రాడు. కానీ, కొత్త కెప్టెన్‌కు రోహిత్ శర్మ ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలి’’ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ‘‘హార్దిక్ పాండ్య వచ్చే సీజన్లో జట్టు మారేందుకూ మొగ్గు చూపిస్తున్నాడు. కేవలం సారథ్యం మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోనున్నాడు. ఏదైనా కంపెనీలో మేనేజ్మెంట్తో సరైన అనుబంధం లేనప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు హార్దిక్ పరిస్థితి కూడా ఇంతే’’ అని ముంబయి క్రికెట్ వర్గాలు తెలిపాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.