
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ట్రోలర్స్‌కి తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చారు. 'ఇంటర్నెట్కి అరిచే శక్తి ఉంది కానీ, ఆలోచించే తెలివి లేదు' అంటూ చురకలంటించారు. బాలీవుడ్ ఫిట్నెస్ ఫ్రీక్, స్టైల్ ఐకాన్‌గా పేరున్న మలైకా తన వ్యక్తిగత జీవితం వల్ల ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. ఈ క్రమంలో ఆమె కొన్ని సార్లు.. ఆన్లైన్ ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా సుదీర్ఘ బంధానికి ఇటీవల ముగింపు పడింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో చాలా గాసిప్స్ వచ్చాయి. ఇలాంటి సమయంలో మలైకా చేసిన ఈ వ్యాఖ్యలు, తన వ్యక్తిగత జీవితంపై వచ్చే వదంతుల నుండి దూరంగా ఉండాలనుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయి.