
RBI on CBDC | ముంబయి: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పైలట్ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) యోచిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగానికీ విస్తరించాలని భావిస్తోంది. ఫైనాన్షియల్ అసెట్ టోకనైజేషన్‌కు ఉన్న అవకాశాలనూ పరిశీలించాలని ఆర్బీఐ యోచిస్తోంది. తద్వారా సీబీడీసీ పైలట్ ప్రాజెక్ట్‌లో మరింత మందిని భాగస్వాములను చేయాలనుకుంటోంది. ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో ఈ అంశాన్ని పొందుపరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్‌లలో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ లబ్ధిదారులకూ ఆహార సబ్సిడీని సీబీడీసీ ద్వారా అందించారు. లబ్ధిదారులు ఆ నిధులను రేషన్ షాపులు, ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా చూశారు. దీన్ని మరింత విస్తరించాలని భావిస్తోంది. పశ్చిమాసియా రూపంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ఇంధన ధరలు, సప్లయ్ చైన్ అవరోధాలు ఉన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధికి ఢోకా లేదని ఆర్బీఐ పేర్కొంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉండడమే దీనికి కారణమని తన వార్షిక నివేదికలో తెలిపింది. కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల బలోపేతమైన బ్యాలెన్స్ షీట్లు, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సానుకూలంగా ఉండనుందని తెలిపింది. వివిధ వాణిజ్య భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా వృద్ధికి దన్నుగా నిలవనున్నాయని అభిప్రాయపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆర్బీఐ గుర్తు చేసింది. 2026-27లో వ్యవసాయ రంగం పశ్చిమాసియా రూపంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన ఇంధన ధరలు, సప్లయ్ చైన్ అవరోధాలు ఉన్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధికి ఢోకా లేదని ఆర్బీఐ పేర్కొంది. పటిష్టమైన స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉండడమే దీనికి కారణమని తన వార్షిక నివేదికలో తెలిపింది. కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల బలోపేతమైన బ్యాలెన్స్ షీట్లు, ప్రభుత్వ మూలధన వ్యయం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి సానుకూలంగా ఉండనుందని తెలిపింది. వివిధ వాణిజ్య భాగస్వాములతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా వృద్ధికి దన్నుగా నిలవనున్నాయని అభిప్రాయపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఆర్బీఐ గుర్తు చేసింది. 2026-27లో వ్యవసాయ రంగం నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటుందని అంచనా వేసింది. ఎల్‌నినో కారణంగా పంటల దిగుబడిపై ప్రభావం ఉన్నా.. రుతు పవనాల ప్రయాణంలో హిందూ మహాసముద్రంలో ఏర్పడే డైపోల్ ద్వారా ప్రతికూల ప్రభావాన్ని అధిగమించొచ్చని పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.