
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Naga Chaitanya:నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ కోర్టులో వాదనలు వినిపించారు. కొన్ని వెబ్సైట్లు నటుడి పేరు, ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్నాయని ఆయన కోర్టుకు వివరించారు. అలాగే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించేందుకు కొన్ని అభ్యంతరకర పదాలతో నాగచైతన్య పేరును జత చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నటుడి ఫోటోలు, చిత్రాలను ఉపయోగించి అనుమతి లేకుండా కొన్ని వస్తువులు విక్రయిస్తున్నారని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. దీనివల్ల నాగచైతన్య ప్రతిష్టకు నష్టం కలిగే అవకాశం ఉందని వాదించారు. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా రూపొందించిన కంటెంట్. ఏఐ సాయంతో తయారు చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు మరియు మార్పులు చేసిన కంటెంట్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని తప్పుడు, అవమానకరమైన విషయాలు కూడా ఆన్లైన్లో ప్రచారం అవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్ ఈ అంశాలను పరిశీలించి నాగచైతన్యకు మధ్యంతర రక్షణ కల్పించారు. అలాగే ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు సమన్లు జారీ చేసి తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి వెబ్సైట్లు, లింకులు వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్ ఈ అంశాలను పరిశీలించి నాగచైతన్యకు మధ్యంతర రక్షణ కల్పించారు. అలాగే ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు సమన్లు జారీ చేసి తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి వెబ్సైట్లు, లింకులు మళ్లీ పుట్టుకొస్తే వాటిపై కూడా చర్యలు తీసుకునేలా డైనమిక్ ఇంజంక్షన్ ఇవ్వాలని నాగచైతన్య తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. ప్రస్తుతం ఈ కేసు తదుపరి విచారణకు వాయిదా పడింది. ప్రతివాదుల సమాధానాలు వచ్చిన తర్వాత కోర్టు పూర్తి స్థాయిలో విచారణ జరపనుంది. ఆన్లైన్లో సెలబ్రిటీల పేరు, ఫోటోలు, వ్యక్తిగత గుర్తింపును అనుమతి లేకుండా ఉపయోగించడం ఎంతవరకు చట్టబద్ధం అనే అంశంపై ఈ కేసు కీలకంగా మారే అవకాశం ఉంది. Also Read: Jr NTR Top Movies: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ చిత్రాలు ఇవే.. Also Read:Jr NTR Top Disaster Movies: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచిన టాప్ డిజాస్టర్ చిత్రాలు ఇవే.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.