
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నిర్వహించిన మహానాడు ఓ మహా నాటకమని, పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసిన ఓ డైవర్షన్ రాజకీయమే అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రజలకు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏదీ లేక ప్రజా సమస్యలు చర్చించాల్సిన మహానాడు వేదికను రాజకీయ నిందల వేదికగా మార్చేశారన్నారు. ముఖ్యమంత్రి దగ్గరి నుంచీ ఆయన మంత్రివర్గం అంతా కూడా వీధి భాషకు బాగా అలవాటు పడ్డారని తెలిపారు. మహిళా రిజర్వేషన్లు ఎలాగో వస్తాయని తెలిసి ముందస్తు క్రెడిట్ చోరీకి లోకేష్ ప్రయత్నించారని శ్యామల ఆక్షేపించారు. మహిళా సాధికారతపై లోకేష్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, వైఎస్ జగన్ హయాంలో ఏం చేశామో చర్చించేందుకు ఏ టీవీ ఛానల్ కైనా వచ్చేందుకు సిద్దమని ఆరె శ్యామల స్పష్టం చేశారు. ప్రెస్ మీట్లో ఆమె ఇంకేమన్నారంటే.. మహిళా రిజర్వేషన్లపై ముందస్తు క్రెడిట్ చోరీ మహిళా రిజర్వేషన్ల గురించి సకలశాఖా మంత్రి లోకేష్ చేసిన ప్రకటన కూడా ఓ డైవర్షనే. మహిళా రిజర్వేషన్లు ఎలాగో దేశమంతా రాబోతున్నాయి. ముందుగానే వాటిని దొంగిలించేందుకే లోకేష్ ఈ ప్రకటన చేశారు. ఇది అడ్వాన్సెడ్ క్రెడిట్ చోరీ అన్నమాట. మహిళల గురించి మాట్లాడేముందు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలి. 18-59 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెలా రూ.1500 ఇస్తామన్నారు. రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. May 29 2026 3:13 PM | Updated on May 29 2026 3:35 PM రెండు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అన్నారు. రెండేళ్లయింది. ఆరు సిలెండర్లు రావాలి. ఇచ్చింది ఒకటి లేదా రెండు. ఇక ఉచిత బస్సు కూడా ఏంతో ఊదరగొట్టి కేవలం ఐదు కేటగిరీలకే పరిమితం చేశారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4 వేలు పెన్షన్ అన్నారు. ఇచ్చింది మాత్రం గుండుసున్నా. తల్లికి వందనంలోనూ 20 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు. ఇక మహిళలకు చేసిందేంటి ? మహిళలకు ఆర్దిక స్వావలంబన చేకూర్చేందుకు వైఎస్ జగన్ పెట్టిన పథకాన్నీ ఎత్తేసి ఇప్పుడు వీళ్లు చెప్తున్న మాటలు నిజంగానే కామెడీగా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్లను ముందుగా అంగీకరించింది జగనే ఏరు దాటాక తెప్ప తగలేసే తండ్రీ కొడుకుల మాటలు నమ్మే పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై దేశమంతా ఒక్కటిగా ఉన్న తరుణంలో దాన్ని కూడా వీళ్ల క్రెడిట్లో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అన్నప్పుడు అందరి కంటే ముందు ఒప్పుకున్నది, ఆచరణలో చేసి చూపించింది వైఎస్ జగన్. మహిళలకు రిజర్వేషన్‌పై లోకేష్ చేసిన ప్రకటనను ఆమోదిస్తున్నట్లు చంద్రబాబు చెప్తున్నారు. అమలు చేసేది వైఎస్ జగన్ మాత్రమే. ఎలాగో పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాబోతోంది, దేశమంతా రిజర్వేషన్ రాబోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మహిళల రిజర్వేషన్ తమ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లుగా మాట్టాడటం సిగ్గుచేటు. మహిళా రిజర్వేషన్లపైనా ఈ క్రెడిట్ చోరీ ఏంటి? మీ రాజకీయ జీవితమంతా క్రెడిట్ చోరీయే. ఎన్టీఆర్ నుంచి పార్టీ చోరీ, ఆయన మరణానికి కారణమైన విమర్శల మధ్య ఆయనకు దండలేసి దండాలు పెడుతున్నారు. ప్రజలు ఏదీ మర్చిపోరు. అన్నీ గుర్తుపెట్టుకుంటారు. హత్యా రాజకీయాలు టీడీపీవే గొడ్డలి పార్టీ అంటున్న వారికి హత్యా రాజకీయాలు ఎవరివో తెలియవా? వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో మీ హత్యా రాజకీయాల్ని స్పష్టంగా వివరించిన తర్వాత ప్రతీ ఒక్కరికీ వాస్తవాలు అర్థమయ్యాయి. మీకు మనస్సాక్షి ఉంటే ఎన్టీఆర్ మరణం, వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్ వంటి వారి హత్యలకు కారకులు ఎవరో చెప్పండి. వివేకానందరెడ్డి హంతకులు కూడా ఇవాళ రోడ్డు మీద ధైర్యంగా ఎలా తిరగగలుగుతున్నారో చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చాక జరిగిన సచివాలయ ఉద్యోగుల మరణాలకు కారణం ఎవరు? స్వాతంత్రం తర్వాత దేశంలోనే తొలిసారి వైఎస్ జగన్ ఒకే రోజు 2019 అక్టోబర్ 2న లక్షా 20 వేల ఉద్యోగుల్ని నియమించి చరిత్ర సృష్టించారు. మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో 100 మంది సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఎవరివి హత్యా రాజకీయాలు, ఎవరిది గొడ్డలి పార్టీయే అర్దమవుతోంది. మీరు అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పాలనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులు పెరిగాయి. 21 మంది రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇప్పుడు చెప్పండి ఎవరిది గొడ్డలి పార్టీ