
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతుంది. ఐపీఎల్ 2026లో అతడు తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. తాజాగా తనకు ఇష్టమైన ఓ విషయం గురించి వెల్లడించాడు. స్పోర్ట్స్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతుంది. ఐపీఎల్ 2026లో అతడు తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. సీజన్ ప్రారంభం నుంచి ఇటీవల జరిగిన ఎలిమినెటర్ మ్యాచ్ వరకు వైభవ్ పలు అద్భుత ఇన్నింగ్స్ ఆడి.. పలు రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్ల పిల్లాడు ఈ స్థాయిలో ప్రదర్శన చేయడంపై క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్యాట్ కమిన్స్ , జస్ప్రీత్ బుమ్రా , జోష్ హేజిల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లపై విజయం సాధించినప్పటికీ, అతడు ఒక పసివాడిలాగే తన గదిలో కార్టూన్లు చూడటానికి ఇష్టపడతాడటం. ఈ విషయాన్ని ఈ చిచ్చర పిడుగే స్వయంగా వెల్లడించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ తో వైభవ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లపై విజయం.. గంట లేదా రెండు గంటల పాటు టెలివిజన్ ముందు గడిపే సమయం ఇచ్చేంత ప్రశాంతత తనకు ఇవ్వదని తెలిపాడు. 'రెండు, మూడేళ్ల క్రితం నేను ఇంట్లో ఉండి మ్యాచ్‌లు ఆడేటప్పుడు లేదా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కార్టూన్లు చూసేవాడిని. అవి నాకు చాలా నచ్చేవి. ఇప్పుడు కూడా, నాకు విశ్రాంతి లేదా ప్రశాంతత కావాలని అనిపించినప్పుడల్లా కార్టూన్లు చూస్తాను. నా గదిలో హాయిగా కూర్చుని నచ్చిన కార్టూన్లు చూస్తాను. అలా చూడటం నాకు చాలా బాగుంటుంది. అలానే ఇంటిని గుర్తు చేస్తుంది' అని వైభవ్ వెల్లడించాడు. ఇటీవల Home » Sports » Cricket News » vaibhav suryavanshi reveals love for cartoons despite ipl 2026 heroics smr ABN , Publish Date - May 29 , 2026 | 03:41 PM ఇటీవల జరిగిన ఎలిమినేటర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై 29 బంతుల్లో 97 పరుగులతో వైభవ్ పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇవాళ(శుక్రవారం) క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాలని ఈ చిచ్చ పిడుగు ఉవ్విళ్లూరుతున్నాడు. వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్