
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం వరకు స్వల్ప లాభాల్లో ట్రేడయ్యాయి. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి, ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగుతుండటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ఠాల నుంచి 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 23,550 దిగువన ముగిసింది. మదుపర్ల సంపద రూ.5 లక్షల కోట్లు క్షీణించి రూ.466 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 75,988.51 (క్రితం ముగింపు 75,867.80) పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడే 76,220.02 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 74,589.11 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరికి 1092.06 పాయింట్ల నష్టంతో 74,775.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 359.40 పాయింట్ల నష్టంతో 23,547.75 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.05గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్ షేర్లు మిగిలిన షేర్లు నష్టపోయాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇండిగో, ఎన్టీపీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91.40 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4530 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.