
AP PGCET 2026 Results | ఇంటర్నెట్ డెస్క్: ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026) ఫలితాలు విడుదలయ్యాయి. మే 8 నుంచి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తంగా 19,118మంది దరఖాస్తు చేసుకోగా.. 16,406 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,020 మంది (91.55 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి రాష్ట్రంలోని 17 యూనివర్సిటీల్లో 30 సబ్జెక్టులకు పీజీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఈ ఏడాది పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించిన అందరికీ మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. అద్భుతమైన ఉత్తీర్ణత శాతం విజేతల కృషి, పట్టుదలకు నిదర్శనమన్నారు. విజయం సాధించిన ప్రతి అభ్యర్థికీ ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ సందర్భంగా ఆకాక్షించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.